ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనుల పండువగా ఉమామహేశ్వర కల్యాణ మహోత్సవం

ABN, First Publish Date - 2023-02-21T00:27:28+05:30

మర్కుక్‌ మండల పరిధిలో అంగడి కిష్టాపూర్‌ గ్రామంలో గల ఉమామహేశ్వర ఆలయంలో కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.

జగదేవ్‌పూర్‌ మండలం అంగడి కిష్టాపూర్‌లో కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎఫ్‌డీసీ చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగదేవ్‌పూర్‌, ఫిబ్రవరి 20 : మర్కుక్‌ మండల పరిధిలో అంగడి కిష్టాపూర్‌ గ్రామంలో గల ఉమామహేశ్వర ఆలయంలో కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపం వరకు ఎదుర్కోలు నిర్వహించారు అనంతరం కల్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. సోమవారం ఈ కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ధర్మ కర్త కప్పర శైలజా మోహన్‌ రావు దంపతులు నిర్వహించగా, అలయ కమిటీ చైర్మన్‌ బల్లి శ్రీనివాస్‌ గుప్తా, సర్పంచ్‌ దుద్దెడ లక్ష్మీరాములు గౌడ్‌, ఎంపీటీసీ గోలి నరేందర్‌, ప్రధాన అర్చకులు వెంకట నర్సింహశర్మ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కల్యాణానికి ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవ మండపాన్ని వివిధరకాల పూలతో విశ్వకర్మ సంఘం మండలాధ్యక్షుడు కంది నరసింహాచారి అధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కొండల్‌రెడ్డి, ఆలయకమిటీ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎర్రబాగు ఆశోక్‌, మాధవి రాజిరెడ్డి, మంజుల శ్రీరాములు, మొండి భాగ్యభిక్షపతి, జవహర్‌నగర్‌ కార్పొరేటర్‌ బల్లి రోజా శ్రీనివాస్‌గుప్తా, పీఆర్టీయూ మర్కుక్‌ మండలాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకులు తదితరులున్నారు.

కుకునూరుపల్లిలో..

కొండపాక: కుకునూరుపల్లిలోని ఉమామహేశ్వర ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని సోమవారం శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2023-02-21T00:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising