ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పౌజ్‌ పాయింట్లు తొలగించాలని ఎమ్మెల్సీకి టీఎన్‌ఎస్‌టీఏ వినతి

ABN, First Publish Date - 2023-04-22T00:05:45+05:30

ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ సమయంలో స్పౌజ్‌ ఉపాధ్యాయులకు ఇచ్చే పది పాయింట్లు తొలగించి అందరికీ సమన్యాయం చేయాలని నాన్‌ స్పౌజ్‌ టీచర్ల అసోసియేషన్‌ (టీఎన్‌ఎస్‌టీఏ)ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

వినతి పత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట, ఏప్రిల్‌ 21: ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ సమయంలో స్పౌజ్‌ ఉపాధ్యాయులకు ఇచ్చే పది పాయింట్లు తొలగించి అందరికీ సమన్యాయం చేయాలని నాన్‌ స్పౌజ్‌ టీచర్ల అసోసియేషన్‌ (టీఎన్‌ఎస్‌టీఏ)ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు నాన్‌ స్పౌజ్‌ ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేస్తూ పేద విద్యార్థులకు అండగా నిలవాలన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని తెలిపారు. నాన్‌ స్పౌజ్‌ టీచర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌టీఏ సిద్దిపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సల్లారపు పద్మారెడ్డి, రవీందర్‌ రెడ్డిల ఆధ్వర్యంలో నాయకులు రామస్వామి, పద్మయ్య, రామచంద్రారెడ్డి, దేవరుషి, మల్లారెడ్డి, జనార్దన్‌ రెడ్డి కనకరాజు, సురేష్‌ కుమార్‌, సిద్దేశ్వర్‌, రామచంద్రారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, రవి కిష్టారెడ్డి, పద్మ, శ్రీకాంత్‌, రామ్‌ రెడ్డి, రామస్వామి, రమణారెడ్డి నర్సింహులు, ధర్మయ్య బాలకిషన్‌, అమరెందర్‌ రెడ్డి, శివాజీ, మన్మోహన్‌ రెడ్డి, చంద్రకాంత్‌, తిరుమలేష్‌, భూపతి రెడ్డి, కనకయ్య, రాజయ్య, సతీష్‌, జనార్ధన్‌, నిరంజన్‌, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-22T00:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising