ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేర్యాల పోలీ్‌సస్టేషన్‌ నుంచి యువకుడి పరార్‌

ABN, First Publish Date - 2023-05-20T23:19:04+05:30

చేర్యాల, మే 20: గంజాయి కేసులో పట్టుబడిన ఓ నిందితుడు చేర్యాల పోలీ్‌సస్టేషన్‌ నుంచి శనివారం తెల్లవారుజామున పరారైన సంఘటన కలకలం రేపింది.

చేర్యాల పోలీ్‌సస్టేషన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంజాయితో పట్టుబడిన ఇరువురిలో ఒక యువకుడి ఉడాయింపు

చేర్యాల, మే 20: గంజాయి కేసులో పట్టుబడిన ఓ నిందితుడు చేర్యాల పోలీ్‌సస్టేషన్‌ నుంచి శనివారం తెల్లవారుజామున పరారైన సంఘటన కలకలం రేపింది. పట్టణ శివారులోని చుంచనకోట గుట్టల్లో శుక్రవారం మధ్యాహ్నం గంజాయితో ప్రజ్ఞాపూర్‌కు చెందిన దురిశెట్టి ప్రవీణ్‌, పట్టణానికి చెందిన అరవింద్‌రెడ్డి పట్టుబడగా, మరో నలుగురు పరారైన విషయం విధితమే. పరారైనవారిని పట్టుకోవడంతో పాటు అదుపులోకి తీసుకున్న ఇరువురిని విచారిస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున దురిశెట్టి ప్రవీణ్‌ పోలీసుల కళ్లుగప్పి ఉడాయించాడు. మూత్ర విసర్జనకు పోలీ్‌సస్టేషన్‌ వెనకభాగంలో ఉన్న మూత్రశాలవైపు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్‌ లేక చీకటి ఉండడాన్ని ఆసరాగా చేసుకుని గోడదూకి పరారైనట్లు తెలిసింది. వెంటనే తేరుకున్న సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా, గజ్వేల్‌ శివారులో పట్టుకున్నట్లు తెలిసింది. కాగా పట్టణానికి చెందిన చాలామంది యువకులు, విద్యార్థులు గంజాయి సేవనానికి బానిసలుగా మారిన నేపథ్యంలో పట్టుబడిన ఇరువురి విచారణతో తీగ లాగితే డొంక కదలి అసలు బాగోతం బయటపడుతుందని భావించారు. కానీ అనూహ్యంగా ఠాణా నుంచి ప్రవీణ్‌ ఉడాయింపు ఘటనతో పక్కదోవపట్టింది. ఈ విషయమై చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా దురిశెట్టి ప్రవీణ్‌ పారిపోవడాన్ని గమనించిన సిబ్బంది వెంబడించి పట్టుకున్నారని, అరవింద్‌రెడ్డితో పాటు ప్రవీణ్‌ను కూడా రిమాండ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-20T23:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising