ఎంసీహెచ్‌లో ముగిసిన ’ముస్కాన్‘ బృందం పర్యటన
ABN, First Publish Date - 2023-05-03T23:29:13+05:30
సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ముస్కాన్ కేంద్ర బృందం పర్యటన బుధవారం ముగిసింది.
సంగారెడ్డి అర్బన్, మే 3: సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ముస్కాన్ కేంద్ర బృందం పర్యటన బుధవారం ముగిసింది. నేషనల్ ఎక్స్‌టర్నల్ అసెస్‌మెంట్‌లో భాగంగా రెండో రోజు కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ రేణుబాల, డాక్టర్ ప్రభాకరన్ ఎస్‌ఎన్‌సీయూ, పీడియాట్రిక్ ఓపీ, పీడియాట్రిక్ వార్డు, ఎన్‌ఆర్‌సీ, ఆర్‌బీఎస్‌కే విభాగాలలోని పలు రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు పీడియాట్రిక్ డాక్టర్లతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ జి.అనీల్‌కుమార్, జిల్లా క్వాలిటీ మేనేజర్ రవి, ఆర్‌ఎంవోలు డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ రవికుమార్, డాక్టర్ పద్మావతి, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-03T23:29:13+05:30 IST