ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్వకుంట్ల కుటుంబంలో బందీగా రాష్ట్రం

ABN, First Publish Date - 2023-06-03T00:21:30+05:30

సోనియా దయతోనే తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్‌ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి

తొగుటలో కాంగ్రెస్‌ జెండాను ఎగురవేస్తున్న చెరుకు శ్రీనివా్‌సరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొగుట, జూన్‌ 2: అమరుల త్యాగాలు, సోనియాగాంధీ దయ వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు కల్వకుంట్ల కుటుంబంలో బందీగా మారిందని కాంగ్రెస్‌ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం తొగుటలో సోనియాగాంధీ చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి రాష్ట్ర విముక్తి కోసం పోరాటం ఉధృతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన విమర్శించారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియాయకాలు అని ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ నేడు చేసిందేమిటని శ్రీనివా్‌సరెడ్డి ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ చేయలే.. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ రాష్ట్రంలో నియంతపాలన సాగిస్తున్నారని చెరుకు శ్రీనివా్‌సరెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల్లో మార్పు వచ్చిందని వచ్చే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టేందుకు తెలంగాణ సమాజం ఎదురుచూస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుల వలే పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసి బహుమతిగా అందజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి, జిల్లా నాయకులు నరేందర్‌రెడ్డి, శ్రీనాకర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, విజయ్‌పాల్‌రెడ్డి, మండల నాయకులు కృష్ణ, యాదగిరి, లక్ష్మి, ఉప్పలయ్య, సుధాకర్‌రెడ్డి, అశోక్‌బాబు, అనిల్‌, తిరుపతి, నర్సింహులు, బాలమల్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising