ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చేనెల నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ

ABN, First Publish Date - 2023-03-05T23:31:05+05:30

గజ్వేల్‌, మార్చి 5: వచ్చే ఏడాది నుంచి యాదవులకు రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు.

యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

డీడీలు కట్టుకుని రెడీగా ఉండండి

రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌

గజ్వేల్‌, మార్చి 5: వచ్చే ఏడాది నుంచి యాదవులకు రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. గజ్వేల్‌ మండలం రిమ్మనగూడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా యాదవుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, షీప్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్‌, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదవుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని, యాదవుల ఆరాధ్య దైవం కొమురవెల్లి మల్లన్న స్వరూపం సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇప్పటికే 50శాతం పూర్తిచేశామని, వచ్చేనెల నుంచి మిగిలిన వారందరికీ గొర్రెల యూనిట్లను అందిస్తామన్నారు. డీడీలు కట్టుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రపంచంలో ఇంటింటికీ మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తలసాని అన్నారు. యాదవులంతా ఐక్యంగా ముందుకు కదలాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising