ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2023-09-22T23:34:39+05:30

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

సిద్దిపేట అగ్రికల్చర్‌, సెప్టెంబరు 22: రైతు రుణమాఫీ ప్రక్రియతో పాటు కొత్త రుణాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేటలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులతో రైతు రుణమాఫీ, కొత్త రుణాల పంపిణీపై అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఏపీజీవీబీలో 8,000 మంది రైతులకుగాను రూ.60 కోట్లు, ఎస్‌బీఐలో 6,000 మంది రైతులకు గాను రూ.35 కోట్లు, యూబీఐలో 4,000 మంది రైతులకుగాను రూ.20 కోట్లు, ఇతరత్రా బ్యాంకుల్లో సుమారు 4,000 మంది రైతుల అకౌంట్లకుగాను రూ.50 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రైతు రుణమాఫీ నగదును రైతులకు వేగంగా అందజేయాలని బ్వాంకర్లకు తెలిపారు. డీబీటీ ఫెయిల్యూర్‌ పెండింగ్‌లో ఉన్న ఖాతాలకు రైతు రుణమాఫీ ఫోర్టల్‌లో ఎస్బీఐ, ఏపీజీవీబీల్లో నమోదు చేయాలని అదేశించారు. వివిధ బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న రుణాలను త్వరగా పూర్తి చేయాలని, వ్యవసాయ అధికారులు ఏడీఏ, ఏవోలు బ్యాంకర్ల నుంచి వివిధ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న జాబితాను తీసుకోవాలని చెప్పారు. బ్యాంకు మేనేజర్లు, ఆర్‌ఎంలు పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని వేగంగా అందించేలా చూడాలని లీడ్‌ బ్యాంకు అధికారిని ఆదేశించారు. కొత్త రుణాలు అందుకునేందుకు అర్హత కలిగిన రైతుల వద్దకు వ్యవసాయ అధికారులు వెళ్లి రుణాల మంజూరు గురించి వివరించాలని కలెక్టర్‌ సూచించారు.

వీధి వ్యాపారులకు రుణాలు అందించాలి

అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌ మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలో 3,500 మంది వీధి వ్యాపారులకు వారం రోజుల్లోగా మెప్మా అధికారుల సహాయంతో బ్యాంకు మేనేజర్లు అందించాలని అదేశించారు. సెర్ప్‌లో 136 ఎంసీబీలకు గాను రూ.11 కోట్లు, మెప్మా పరిధిలో గల 75 ఎంసీబీలకు గాను రూ.7కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు వారంలోపు పూర్తి చేయాలని సూచించారు. ఆహార ఉత్పత్తి పీఎంఎ్‌ఫఎంఈ పరిధిలో గల 94 యూనిట్లు వేగంగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 20 ట్రాక్టర్‌ రుణాలు, 131 ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలను క్యాంపులు పెట్టి వారంలోగా పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్‌ బ్యాంకు అధికారి సత్యజిత్‌, డీఆర్డీఏ పీడీ జయదేవ్‌ ఆర్యా, ఎస్బీఐ ఆర్‌ఎం అరుణ్‌ జ్వోతి, యూబీఐ డీఆర్‌ఎం రాఘవ, రీజనల్‌ అధికారులు, వ్యవసాయ అఽధికారులు, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising