ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2023-04-03T00:21:44+05:30

పదో తరగతి పరీక్షలు నేటి నుంచి 13వ తేదీ వరకు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సంగారెడ్డి జిల్లాలో 118 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 21,413 మంది

మెదక్‌ జిల్లాలో 69 కేంద్రాలు.. 10.700 మంది విద్యార్థులు

మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 2: విద్యార్థి జీవితంలో భారీ లక్ష్య సాధనలో తొలి అడుగు పడనుంది. ఏడాదిగా రాత్రింబవళ్లు పుస్తకాలే నేస్తాలైన పదో తరగతి విద్యార్ధులు బోర్డ్‌ ఎగ్జామ్స్‌కు సిద్ధమయ్యారు. పదో తరగతి పరీక్షలు నేటి నుంచి 13వ తేదీ వరకు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష సమయానికి గంట ముందు నుంచే విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష సమయం దాటిన 5నిమిషాల వరకు విద్యార్థులకు అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి ఎలకా్ట్రనిక్‌ పరికరాలకు అనుమతించరు. సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. పరీక్ష జరుగుతున్నంత సేపు జిరాక్స్‌ సెంటర్లు మూసి వేయనున్నారు. అన్ని రూట్లలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. యూనిఫాంలో విద్యార్థులు పరీక్షా కేంద్రానికి రావద్దని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

మూడు పేపర్లకు అదనపు సమయం

పదో తరగతి పరీక్షల్లో గతంలో 11 పేపర్లు ఉండేవి. ప్రస్తుతం వీటిని 6 పేపర్లకు కుదించారు. ప్రతీ పేపర్‌కు 3 గంటల సమయం ఇచ్చారు. సైన్స్‌, తెలుగు, ఉర్దూ సబ్జెక్టులను మాత్రం రెండు భాగాలుగా చేశారు. వీటి ప్రశ్న పత్రాలు మార్చాల్సి ఉండటంతో 20 నిమిషాలు అదనంగా కేటాయించారు. ఈ సబ్జెక్టులకు మాత్రం మధ్యాహ్నం 12:50 వరకు పరీక్ష జరుగనుంది.

సీసీ కెమెరాల నిఘా..

పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో సీసీకెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి అనుసంధానించారు. ప్రశ్నపత్రాలు సీసీకెమెరాల ఎదుట ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. అవకతవకలకు అవకాశం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా ఎస్‌ఎ్‌సపీబోర్డు అధికారులు పరీక్షలను నిరంతరం పర్యవేక్షించనున్నారు.

మెదక్‌ జిల్లాలో...

మెదక్‌ జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10,700 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలురు 5,347 మంది, బాలికలు 5,353 మంది ఉన్నారు. పర్యవేక్షణ కోసం 3 ఫ్లయింగ్‌స్క్వాడ్‌, 17 సిట్టింగ్‌స్క్వాడ్‌, 19 కస్టోడియన్‌ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏ సమస్య ఉన్నా వెంటనే సమాచారం ఇవ్వడానికి మెదక్‌లోని డీఈవో కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు.

సంగారెడ్డి జిల్లాలో...

సంగారెడ్డి జిల్లాలో 118 కేంద్రాలను ఎంపిక చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 75 సెంటర్లు, ప్రైవేటు స్కూళ్లలో 43 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 21,413 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్‌ 21,389 మంది, ప్రైవేటు 24 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు సుమారు 1,100 మంది ఇన్వినిజిలేటర్లను విద్యాశాఖ నియమించింది. పర్యవేక్షించేందుకు ఫ్లైయింగ్‌స్వ్కాడ్‌, సిట్టింగ్‌స్క్వాడ్‌ టీమ్స్‌, చీఫ్‌సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, రూట్‌ ఆఫీసర్లను నియమించారు.

Updated Date - 2023-04-03T00:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising