ముత్తిరెడ్డిని విమర్శించే స్థాయి శ్రీరాములుకు లేదు
ABN, First Publish Date - 2023-07-21T23:54:44+05:30
ఎంపీపీలు కర్ణాకర్, కృష్ణారెడ్డి పార్టీ మండల, గ్రామశాఖ నుంచి తొలగింపు
చేర్యాల/మద్దూరు, జూలై 21: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని విమర్శించే స్థాయి ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములుకు లేదని, ఎమ్మెల్యేపై విమర్శలు తగవని చేర్యాల ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, మద్దూరు ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అన్నారు. చేర్యాల, దూళిమిట్టలో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడారు. ఎలక్షన్ల సమయంలోనే పార్టీ, ప్రజలు గుర్తుకువచ్చే మండల శ్రీరాములు స్వార్థపూరి తంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇంకోసారి ముత్తిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నియోజకవర్గంలో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. రాబోవు ఎన్నికల్లో కూడా ముత్తిరెడ్డికే టికెట్ వస్తుందని, మూడోసారి భారీ మెజార్టీతో గెలుపించుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్ దూళిమిట్ట గ్రామ, మండల శాఖ నుంచి మండల రాములును సస్పెండ్ చేస్తున్నట్లు ఎంపీపీ కృష్ణారెడ్డి ప్రకటించారు. చేర్యాలలో నిర్వహించిన సమావేశంలో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశం, సర్పంచులఫోరం అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బాలరాజు, మల్లన్న ఆలయ డైరెక్టర్ గిరిధర్, కో-ఆప్షన్ సభ్యుడు నాజర్, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దాసు, యూత్ అధ్యక్షుడు రాజేశ్, బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు రాజశేఖర్, పీఏసీఎస్ డైరెక్టర్ కమలాకర్, కొలిపాక భాస్కర్ పాల్గొన్నారు. దూళిమిట్టలో నిర్వహించిన సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు మంద యాదగిరి, మేక సంతోష్, సొసైటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశం, నాయకులు దుబ్బుడు వేణుగోపాల్‌రెడ్డి, స్వర్గం లక్ష్మయ్య, బర్మ రాజమల్లయ్య, తాళ్లపల్లి భిక్షపతి, బడుగు సాయిలు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T23:54:44+05:30 IST