ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి, ఖేడ్‌లో భాషోపాధ్యాయుల నిరసనలు

ABN, First Publish Date - 2023-02-04T23:21:58+05:30

తెలుగు, హిందీ భాషోపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని కోరుతూ భాషా పండితుల జేఏసీ ఇచ్చిన పిలుపుతో శనివారం సంగారెడ్డి, నారాయణఖేడ్‌లో భాషోపాధ్యాయులు అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలను ఇచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.

నారాయణఖేడ్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేస్తున్న భాషోపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి అర్బన్‌/నారాయణఖేడ్‌, ఫిబ్రవరి 4: తెలుగు, హిందీ భాషోపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని కోరుతూ భాషా పండితుల జేఏసీ ఇచ్చిన పిలుపుతో శనివారం సంగారెడ్డి, నారాయణఖేడ్‌లో భాషోపాధ్యాయులు అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలను ఇచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాషోపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం ఇచ్చిన మాట ప్రకారం భాషోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 1నుంచి 9, 10 తరగతులకు బోధనను బహిష్కరించి సహాయ నిరాకరణ కొనసాగిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో భాషోపాధ్యాయులు చంద్రమోహన్‌, సాయిలు చారి, మల్లికార్జున్‌, పూర్ణకృష్ణ, సంజీవులు, సంతోశ్‌కుమార్‌, ప్రకాశ్‌, రంజిత్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-04T23:21:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising