ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలనకు ఉద్యమించాలి

ABN, First Publish Date - 2023-03-25T23:14:27+05:30

హుస్నాబాద్‌, మార్చి 25: భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలనకు ఉద్యమాలను తీవ్రం చేయాలని, అవి పోయినప్పుడే పేదల జీవితాలు మారుతాయని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నెబోయిన వెంకటాద్రి అన్నారు.

ప్రతినిధుల సమావేశంలో గ్రామీణ పేదల సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి

హుస్నాబాద్‌, మార్చి 25: భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలనకు ఉద్యమాలను తీవ్రం చేయాలని, అవి పోయినప్పుడే పేదల జీవితాలు మారుతాయని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నెబోయిన వెంకటాద్రి అన్నారు. శనివారం హుస్నాబాద్‌ పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా రెండోరోజు జరిగిన ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సంఘాలను పాలకులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. దున్నేవాడికి భూమి సాధించేందుకు వ్యవసాయ విప్లవాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతవత్‌ రాందాస్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి పోలేబోయిన ముత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పడిగ ఎర్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గన్నెబోయిన వెంకటాద్రితో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

Updated Date - 2023-03-25T23:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising