ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే పద్మారెడ్డి దత్తత గ్రామంలో కానరాని అభివృద్ధి

ABN, First Publish Date - 2023-03-05T23:30:29+05:30

మెదక్‌ ఎమ్మెల్యే పద్మారెడ్డి దత్తత తీసుకున్న యుసు్‌ఫపేట గ్రామంలో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి తప్పితే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు.

యుసు్‌ఫపేటలో జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాపన్నపేట, మార్చి 5: మెదక్‌ ఎమ్మెల్యే పద్మారెడ్డి దత్తత తీసుకున్న యుసు్‌ఫపేట గ్రామంలో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి తప్పితే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు. ఆదివారం ‘హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర’లో భాగంగా మండలంలోని యూసు్‌ఫపేట, ఆరేపల్లిలో వాడవాడలా తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు చేసే మంచి పనుల గురించి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమా..? అని ఎమ్మెల్యేకు సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చ లేకపోయిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మాదిరిగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో పీసీసీ నాయకులు సుప్రభాతరావు, జిల్లా కాంగ్రెస్‌ కిసాస్‌ సెల్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ కౌన్సిలర్‌ ఆంజనేయులు, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మండలాధ్యక్షుడు గోవింద్‌నాయక్‌, అసిజొద్దీన్‌, ఎంపీటీసీలు శ్రీనివాస్‌, రమే్‌షగౌడ్‌, ప్రేమ్‌కుమార్‌, శ్రీకాంత్‌రెడ్డి, సతీ్‌షకుమార్‌, రాజశేఖర్‌, బాగారెడ్డి, ఖలీం, నాగరాజు పాల్గొన్నారు. అనంతరం కుర్తివాడ గ్రామానికి వెళ్లిన తిరుపతిరెడ్డి ఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Updated Date - 2023-03-05T23:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising