‘మన ఊరు -మన బడి’ పనులను త్వరగా పూర్తి చేయాలి: డీఈవో
ABN, First Publish Date - 2023-01-11T23:21:03+05:30
మండలంలో కొనసాగుతున్న ‘మన ఊరు- మన బడి’ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి రమే్‌షకుమార్ అఽధికారులకు, సర్పంచులకు సూచించారు.
పెద్దశంకరంపేట, జనవరి 11: మండలంలో కొనసాగుతున్న ‘మన ఊరు- మన బడి’ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి రమే్‌షకుమార్ అఽధికారులకు, సర్పంచులకు సూచించారు. బుధవారం మండలంలో కొనసాగుతున్న మన ఊరు- మన బడి పనులను ఆయన పరిశీలించారు. పనులను పూర్తి చేసి వినియోగంలోనికి తేవాలని ఆయన సూచించారు. పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. అనంతరం కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో ఎఫ్‌ఎల్‌ఎన్ పై సమీక్షా సమావేశం నిర్వహించి, విద్యార్థులకు పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని చదువులో రాణించాలని సూచించారు. అనంతరం స్థానిక భవిత కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట సెక్టోరియల్ అధికారి సూర్యప్రకాష్, సర్పంచు సత్యనారాయణ, మండలనోడల్ అధికారి రాజేశ్వర్, విజయ్‌కుమార్, సుజాత, బి.శ్రీనివాస్, మారుతి, రామక్రిష్ణాగౌడ్, ఎమ్మార్సీ సిబ్బంది సంగమేశ్వర్, సూర్యమణి, తదితరులున్నారు.
Updated Date - 2023-01-11T23:21:04+05:30 IST