ఐక్యంగా బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుదాం
ABN, First Publish Date - 2023-08-02T00:12:38+05:30
60 శాతం ఉన్న 72 నియోజకవర్గాల్లో బీసీలకే టికెట్లు ఇవ్వాలి బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేష్ డిమాండ్
హుస్నాబాద్, ఆగస్టు 1: ఐక్యంగా ఉండి బీసీల రాజ్యాధికారమే లక్ష్మంగా కొట్లాడుదామని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేష్ పిలుపునిచ్చారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో జరిగిన బీసీ రాజకీయ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 72 నియోజకవర్గాల్లో 60 శాతానికి పైగా బీసీలున్నారని, రాజకీయ పార్టీలకు నిబద్ధత ఉంటే ఈ నియోజకవర్గాల్లో బీసీలకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రలోభాలకు లొంగకుండా అగ్రవర్ణాల తొత్తులు కాకుండా బీసీల ఓట్లు బీసీలకు వేసి అసెంబ్లీకి పంపించాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా 11 బీసీ కార్పొరేషన్లకు, 7 ఫెడరేషన్లకు ప్రతినిధులను నియమించలేదని, పైసా ఇవ్వకుండా 572 మంది బీసీ నాయకులను ఎదగకుండా చేశారని ఆరోపించారు. అధికారం కోసం అగ్రవర్ణాలు బీసీల్లో కులాలను సృష్టించారని చెప్పాఉ. హుస్నాబాద్‌లో వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలపునిచ్చారు. బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కుల సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. బీఎస్పీ బీసీలకు 70 స్థానాల్లో టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు ఎన్ని సీట్లు ఇస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. బీసీ నాయకుడు, ములుగు జడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్ చనిపోతే సీఎం కేసీఆర్ వారి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. హార్ట్ ఎటాక్ పేరుతో బీసీ నాయకులపై బీఆర్‌ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. అధికారానికి దూరంగా ఉన్న జాతులు అంతరించి పోతాయని, అందుకే రాజ్యాధికారం కోసం బీసీలంతా ఐక్యం కావాలని కోరారు. ఈ సదస్సులో కవి, రచయిత, సామాజిక విశ్లేషకుడు వడ్డెపల్లి మల్లేశం, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్‌గౌడ్, మండలాధ్యక్షుడు వెల్దండి సంతోష్, పట్టణ అధ్యక్షుడు చొక్కాచారి, బీసీ సంఘాల నాయకులు కొయ్యడ కొంరయ్య, కొత్తపల్లి సత్యనారాయణ, వరియోగుల సుదర్శనస్వామి, రాజేందర్,, వేల్పుల రాజు, వెంకటేశ్వర్లు, శంకర్, ఐలయ్య, నాంపల్లి సమ్మయ్య, మహేందర్, లక్ష్మణ్, సదానందం, సన్నీల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T00:12:38+05:30 IST