ఉమ్మడి మెదక్ జిల్లా ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులు
ABN, First Publish Date - 2023-06-02T00:20:08+05:30
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మూడు ఆస్పత్రులు జాతీయ ఆరోగ్య మిషన్ అందించే కాయకల్ప అవార్డులను దక్కించుకున్నాయి.
రాష్ట్రస్థాయి సీహెచ్‌సీల విభాగంలో తూప్రాన్ ఆసుపత్రి ఫస్ట్
జిల్లా ఆసుపత్రుల విభాగంలో రన్నర్‌గా గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి
నర్సాపూర్‌కు కమెండేషన్ అవార్డు
తూప్రాన్/గజ్వేల్,, జూన్ 1: ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మూడు ఆస్పత్రులు జాతీయ ఆరోగ్య మిషన్ అందించే కాయకల్ప అవార్డులను దక్కించుకున్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం దక్కించుకోగా, నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి కమెండేషన్ అవార్డు దక్కింది. కాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి వరుసగా మూడో ఏడాది కాయకల్ప అవార్డులో రన్నర్‌పగా నిలిచి అవార్డు సాధించడం గమనార్హం. దీంతో ఆయా ఆస్పత్రుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిధులు దక్కనున్నాయి. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ప్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ స్వేత మహంతీ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే. కాయకల్ప పీర్ అసె్‌సమెంట్ బృందం ఉమ్మడి జిల్లాలోని ఆసుపత్రులను పలుమార్లు సందర్శించింది. ఆయా ఆసుపత్రుల్లో స్వచ్ఛత, రోగులకు, వారి కుటుంబసభ్యులకు అందుతున్న సదుపాయాలు, బయో మెడికల్ వేస్టేజ్, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుధ్యం, రికార్డుల నమోదు, సిబ్బంది పనితీరు ఇలా ఎనిమిది అంశాలపై అధ్యయనం చేసి, నివేదికను జాతీయ ఆరోగ్య మిషన్‌కు బృందం సభ్యులు అందజేశారు. ఈ మేరకు ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల కేటగిరీలో 2022-23 ఏడాదికి గానూ తూప్రాన్ సీహెచ్‌సీ ఆస్పత్రి 89.7శాతం స్కోరుతో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి 70శాతం స్కోరుతో కమెండేషన్ అవార్డు లభించింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా ఆసుపత్రుల కేటగిరిలో గజ్వేల్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రి 87.47 శాతం స్కోరును సాధించి రన్నర్‌పగా నిలిచింది. కాగా ఇదే కేటగిరీలో గజ్వేల్‌లోని జిల్లా ఆసుపత్రి గతేడాది (2021-22) రన్నర్‌పగా నిలవగా, ఏరియా ఆసుపత్రుల కేటగిరిలో 2020-21 సంవత్సరంలోనూ రన్నరప్ సాధించడం గమనార్హం. కాగా సీహెచ్‌సీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన తూప్రాన్ సీహెచ్‌సీ ఆస్పత్రి నిర్వహణకు రూ. 15 లక్షలు, రాష్ట్రస్థాయి జిల్లా ఆసుపత్రుల కేటగిరిలో రెండో స్థానం సాధించిన గజ్వేల్‌లోని జిల్లా ప్రభుత్వాసుపత్రి నిర్వహణకు రూ.20లక్షల బహుమతితో పాటు నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి కమెండేషన్ అవార్డు కింద రూ. లక్ష నిధులు అందనున్నాయి. తూప్రాన్ సీహెచ్‌సీకి రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం దక్కడంపట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అమర్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. కాయకల్ప అవార్డు రావడానికి కృషి చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గజ్వేల్‌లోని జిల్లాఆసుపత్రి సూపరింటెండెంట్ సాయికిరణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచనలతోనే మరోసారి రన్నర్‌పగా నిలిచామని తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2023-06-02T00:20:08+05:30 IST