భక్తజన సంద్రమైన ఝరాసంగం
ABN, First Publish Date - 2023-02-19T00:20:02+05:30
సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేతకీసంగమేశ్వరస్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఝరాసంగం, ఫిబ్రవరి 18 : సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేతకీసంగమేశ్వరస్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అభిషేక ప్రియుడిని బిల్వపత్రం.. మంత్రపుష్పాలతో పూజించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు విచ్చేశారు. శనివారం వెకువజామునే పవిత్రగండంలో స్నానాలు ఆచరించి, పరమశివుడిని దర్శనం కోసం పంచాక్షరి మంత్రం పఠిస్తూ క్యూలైన్లలో బారులుతీరారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీసీఎంస్ చెర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్‌పాటిల్, సర్పంచ్ జగదీశ్వర్, ఆలయ చైర్మన్ వెంకటేషంగుప్తా, ఈవో శ్రీధర్ తదితరులు ఉన్నారు. మరోవైపు ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్‌లో తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఆదేశించినా అవేమీ కన్పించలేదు. వీఐపీలు, పరిచయస్థులను ఇష్టారీతిన దర్శనానికి వదలడంతో క్యూలో వేచిఉన్న భక్తులు, శివస్వాములు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Updated Date - 2023-02-19T00:20:03+05:30 IST