ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్థానికులకు టికెట్‌ ఇస్తేనే పనిచేస్తం

ABN, First Publish Date - 2023-08-02T23:51:22+05:30

జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు

జహీరాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

జహీరాబాద్‌, ఆగస్టు 2: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్‌ టికెట్‌ స్థానికులకు ఇస్తేనే పనిచేస్తామని స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు. బుధవారం జహీరాబాద్‌ పట్టణంలోని ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జహీరాబాద్‌ టికెట్‌ స్థానికులకే ఇవ్వాలని, లేదంటే తాము తీసుకునే నిర్ణయాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు. కాగా మంత్రి హరీశ్‌రావును కార్మికనేత హుగ్గెల్లి రాములు విమర్శించడం సరికాదని సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌పాటిల్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ పెంటారెడ్డి అన్నారు. తెలంగాణ ఉధ్యమసాధనలో మంత్రి హరీశ్‌రావు చేసినకృషి అమోఘమన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో వారిద్దరి మధ్య అనుకోకుండా జరిగిన సంఘటన అందరినీ బాధపెట్టేలా ఉందని విచారం వ్యక్తం చేశారు. చెరుకురైతులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్ని ఇప్పటి వరకు ఇప్పించామని, ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. వాటిని కూడా త్వరలో ఇప్పించి కర్మాగారం యధావిధిగా కొనసాగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఏసీఎస్‌ చైర్మన్‌ మశ్చేందర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు తట్టునారాయణ, హీరురాథోడ్‌, రాజు, తాజోద్ధీన్‌, మాణెమ్మ, విజయ్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మాజీ కౌన్సిలర్లు రాములునేత, మోతీరాం, జహంగీర్‌, అబ్ధుల్లా వేరే సమావేశంలో మాట్లాడతూ.. మంత్రి హరీశ్‌రావును హుగ్గెల్లి రాములు విమర్శించే స్థాయి కాదని హెచ్చరించారు.

Updated Date - 2023-08-02T23:51:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising