అసత్య ప్రచారంతో రాజకీయ పబ్బం గడుపుకోవడం తగదు
ABN, First Publish Date - 2023-03-02T23:45:22+05:30
చేర్యాల, మార్చి 2: పట్టణ ప్రజలకు భారంగా మారకుండా గతంలో మున్సిపల్ పన్నుశాతం తగ్గించడంతో పాటు మరోమారు తగ్గించేందుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించినప్పటికీ పలువురు స్వార్థపరులు అసత్య ప్రచారం చేస్తూ ధర్నా పేరిట రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకోవడం తగదని మున్సిపల్ చైర్‌పర్సన్ అంకుగారి స్వరూపారాణి విమర్శించారు.
చేర్యాల, మార్చి 2: పట్టణ ప్రజలకు భారంగా మారకుండా గతంలో మున్సిపల్ పన్నుశాతం తగ్గించడంతో పాటు మరోమారు తగ్గించేందుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించినప్పటికీ పలువురు స్వార్థపరులు అసత్య ప్రచారం చేస్తూ ధర్నా పేరిట రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకోవడం తగదని మున్సిపల్ చైర్‌పర్సన్ అంకుగారి స్వరూపారాణి విమర్శించారు. గురువారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. భూమి మార్కెట్ విలువలు రెండుసార్లు పెరగడంతో ఆస్తిపన్ను పెరిగిందన్న వాస్తవాన్ని గ్రహించకుండా పాలకమండలిపై అభాండాలు మోపడం సరికాదన్నారు. మున్సిపల్ పాలకవ ర్గంపై తప్పుడు ప్రచారం చేయడం మాని అభివృద్ధికి కలిసిరావాలని సూచించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్లు చెవిటి లింగం, ఆడెపు నరేందర్, జుబేదా, సురేశ్, తార, పచ్చి మడ్ల సతీశ్, కో ఆప్షన్‌సభ్యులు నాగేశ్వర్‌రావు, పచ్చిమడ్ల అంజనీదేవి, ఆరోగ్యరెడ్డి పాల్గొన్నారు.
ధర్నా స్థలాన్ని పరిశీలించిన జేఏసీ నాయకులు
చేర్యాల, మార్చి 2: మున్సిపల్ పన్నులను పాత పద్ధతిలోనే వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ 6న మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఇటీవల ప్రకటించిన జేఏసీ నాయకులు గురువారం ధర్నా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్ మాట్లాడుతూ సిద్దిపేట, గజ్వేల్, హుస్నా బాద్, జనగామ మున్సిపాలిటీలలో లేనివిధంగా చేర్యాల మున్సిపల్ పరిధిలో అడ్డగోలుగా పన్నులు వేస్తుండటం తగదన్నారు. ఈ విషయమై పన్నుశాతం తగ్గించి పాలకమండలి చిత్తశుద్ధి చాటుకోవాలని, లేనియెడల ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి, పుర్మ ఆగంరెడ్డి, లింగమూర్తి, అంజయ్య పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T23:45:22+05:30 IST