ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆధునిక హంగులతో గ్రామపంచాయతీ భవనాలు

ABN, First Publish Date - 2023-08-28T00:17:50+05:30

జిన్నారం, ఆగస్టు 27: గ్రామాల పరిపాలనా కేంద్రాలైన గ్రామపంచాయతీ భవనాలు ఆధునిక వసతులు, అన్ని హంగులతో కార్పొరేట్‌ స్థాయి కార్యాలయాలుగా మారుతున్నాయి.

జంగంపేటలో ప్రారంభానికి సిద్ధమైన పంచాయతీ భవనం

పంచాయతీలకు పరిశ్రమల సహాయం

రూ.4 కోట్లతో గ్రామ పరిపాలనా భవనాలు అందుబాటులోకి..

జిన్నారం, ఆగస్టు 27: గ్రామాల పరిపాలనా కేంద్రాలైన గ్రామపంచాయతీ భవనాలు ఆధునిక వసతులు, అన్ని హంగులతో కార్పొరేట్‌ స్థాయి కార్యాలయాలుగా మారుతున్నాయి. ప్రభుత్వంతో పాటు పలు పరిశ్రమల ఆర్థిక సహాయంతో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న జీపీ భవనాలు పంచాయతీ కార్యాలయాల రూపురేఖలనే మార్చేస్తున్నాయి. జిన్నారం మండలంలోని పలు గ్రామపంచాయతీ భవనాలు ఆధునిక హంగులతో నిర్మాణం చేపట్టారు. ఇటీవలే మండల కేంద్రం జిన్నారంలో హెటిరో పరిశ్రమ ఆర్థిక సహాయం (సీఎ్‌సఆర్‌) రూ.60 లక్షలతో చేపట్టిన జీపీ భవనం అందుబాటులోకి వచ్చింది. జంగంపేటలో హెటిరో ఆధ్వర్యంలో రూ.40 లక్షలు వెచ్చించి నిర్మించిన జీపీ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. ఈ పంచాయతీలో అధునాతన సౌకర్యాలు, ఫర్నిచర్‌ ఏర్పాటుచేశారు. ఇక పారిశ్రామిక జీపీ అయిన కాజీపల్లిలో సుమారు రూ.1 కోటితో నాలుగు అంతస్థుల్లో పంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఇది మరికొన్నిరోజుల్లో అందుబాటులోకి రానున్నది. ఇందులో పాలకమండలి సమావేశం మందిరం, ఈవో, సర్పంచులకు ప్రత్యేక గదులు, లైబ్రరీ, స్టోర్‌ సహా పలు సౌకర్యాల కోసం నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా మరో పారిశ్రామిక పంచాయతీ గడ్డపోతారంలోనూ రూ.1.50 కోట్ల సీఎ్‌సఆర్‌ నిధులతో భారీ జీపీ భవనం నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి మొదటి అంతస్థు పూర్తయింది. ఇందులోనూ ప్రత్యేక గదులు, కార్యాలయాలు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవతో, పరిశ్రమల సీఎ్‌సఆర్‌ నిధులతో ఈ భవనాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని హంగులతో, ఆధునిక సౌకర్యాల ఏర్పాటుతో జీపీ భవనాలకు కార్పొరేట్‌ కళ వచ్చింది.

Updated Date - 2023-08-28T00:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising