ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2023-02-05T23:06:46+05:30

గజ్వేల్‌ టౌన్‌, ఫిబ్రవరి 5: పేద రెడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి, కొట్టం మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అభివాదం చేస్తున్న రెడ్డి జాగృతి నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజ్వేల్‌ టౌన్‌, ఫిబ్రవరి 5: పేద రెడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి, కొట్టం మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో గజ్వేల్‌లోని పీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో ఆదివారం రెడ్ల ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీమేరకు ఐదువేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఈ డబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రెడ్డి విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి రూ.20 లక్షల విదేశీ విద్యా పథకం ప్రవేశపెట్టాలని, దళితబంధు పథకం లాగానే రెడ్లకు ప్రత్యేక పథకాన్ని ఏర్పాటుచేసి అమలు చేయాలని, ఎస్సీ, బీసీ గురుకులాల మాదిరిగానే రెడ్డి గురుకులాలు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని రెడ్డిలందరినీ ఏకం చేయడానికి 100 రోజుల్లో 12 రెడ్డి ఆత్మీయ సభలను నిర్వహించ తలపెట్టామని, గజ్వేల్‌ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి నాయకులు నరసింహారెడ్డి, బాలకృష్ణారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, వసంతరెడ్డి, రాకే్‌షరెడ్డి, సతీ్‌షరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-05T23:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising