ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు సంఘటితమైతేనే బంగారు భవిష్యత్‌: కొమురయ్య

ABN, First Publish Date - 2023-02-06T23:22:37+05:30

తొగుట, ఫిబ్రవరి 6: రైతులు సంఘటితమైతేనే వారికి బంగారు భవిష్యత్‌ ఉంటుందని మార్కెట్‌ చైర్మన్‌ కొమురయ్య అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమురయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొగుట, ఫిబ్రవరి 6: రైతులు సంఘటితమైతేనే వారికి బంగారు భవిష్యత్‌ ఉంటుందని మార్కెట్‌ చైర్మన్‌ కొమురయ్య అన్నారు. సోమవారం తొగుట మండలం రాంపూర్‌ కోటిలింగాల ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఒక యూనియన్‌గా ఏర్పడి ప్రభుత్వ, బ్యాంకుల సహకారంతో వారికి ఉన్న సమస్యలను తీర్చుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే ఎఫ్‌ఫీసీల ద్వారా మాత్రమే అవుతుందన్నారు. భవిష్యత్తులో నూనెలకు చాలా డిమాండ్‌ ఉన్నదని, మంత్రి హరీశ్‌రావు ముందుచూపుతో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని సిద్దిపేట జిల్లాకు తీసుకొచ్చారన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ వెంకట్రావుపేట, లింగాపూర్‌, ఎల్‌బంజేరుపల్లి, చందాపూర్‌ నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు నర్సింహులు ఏకలవ్య ఫౌండేషన్‌ ట్రస్టీ, నాగపురి రైతుసేవా చైర్మన్‌ తిరుపతి, జిల్లా కో ఆర్డినేటర్‌ సంతోష్‌నాయక్‌, ఎస్బీఐ తొగుట శాఖ మేనేజర్‌ ఫణికుమార్‌, వ్యవసాయాధికారి మోహన్‌, రాంపూర్‌ సర్పంచ్‌ భర్త ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:22:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising