ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు అధైర్యపడవద్దు.. ఆదుకుంటాం

ABN, First Publish Date - 2023-05-02T23:48:44+05:30

ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

నర్సాపూర్‌ మండలం నారాయణపూర్‌ వద్ద వరిపంటను పరిశీలిస్తున్న మదన్‌రెడ్డి, సునీతారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సాపూర్‌/శివ్వంపేట/వెల్దుర్తి, మే 2: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైరపర్సన్‌ సునీతారెడ్డి భరోసా కల్పించారు. మంగళవారం నర్సాపూర్‌ మండలంలోని నారాయణపూర్‌, అచ్చంపేట, లింగాపూర్‌, గొల్లపల్లి, బ్రాహ్మణపల్లి, వెల్దుర్తి మండలంలోని చర్లపల్లి, చర్లపల్లి తాండా, శేరిలా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి పరిశీలించారు. అలాగే శివ్వంపేట మండలంలోని బీమ్లాతండా, పాంబండ, కొత్తపేట, ఉసిరికపల్లి, తాళ్లపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంట చేతికందే సమయంలో దెబ్బతినడం బాధాకరమన్నారు. అయినప్పటికీ వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి, నష్టపరిహారం అందించే దిశగా సన్నాహాలు చేస్తుందన్నారు. వారివెంట వెల్దుర్తి జడ్పీటీసీ రమే్‌షగౌడ్‌, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ అశోక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు నరేందర్‌రెడ్డి, వెంకటేశం, మన్సూర్‌ అలీ, రాంరెడ్డి ఉన్నారు.

Updated Date - 2023-05-02T23:48:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising