ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సౌలభ్యం కోసమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ABN, First Publish Date - 2023-05-02T23:29:41+05:30

తొగుట, మే 2: రైతుల సౌలభ్యం కోసమే గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని తొగుట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమురయ్య, ఎంపీపీ లతానరేందర్‌రెడ్డి, కాన్గల్‌ సొసైటీ చైర్మన్‌ హరికృష్ణారెడ్డి పేర్కొన్నారు.

తొగుటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కొమురయ్య, ఎంపీపీ లత, సొసైటీ చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమురయ్య

తొగుట, మే 2: రైతుల సౌలభ్యం కోసమే గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని తొగుట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమురయ్య, ఎంపీపీ లతానరేందర్‌రెడ్డి, కాన్గల్‌ సొసైటీ చైర్మన్‌ హరికృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తొగుట మార్కెట్‌యార్డులో ఐకేపీ, రాంపూర్‌లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తొగుట సర్పంచ్‌ కొండల్‌రెడ్డి, ఎంపీటీసీ లలితారమేశ్‌, మార్కెట్‌ కమిటీ, సొసైటీ వైస్‌ చైర్మన్లు రాంరెడ్డి, యాదగిరి, ఐకేపీ ఏపీఎం మగ్దుంఅలీ, సొసైటీ సీఈవో గంగారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాంరెడ్డి పాల్గొన్నారు.

మద్దూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చేర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుంకరి మల్లేశం తెలిపారు. మంగళవారం జాలపల్లిలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చొప్పరి వరలక్ష్మీసాగర్‌ ఆధ్వర్యంలోపార్టీ మండలాధ్యక్షుడు మంద యాదగిరి, దూళిమిట్టలో సర్పంచ్‌ దుబ్బుడు దీపికావేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్‌ నాగిళ్ల తిరుపతిరెడ్డి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్‌ నారోజు శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ సంపత్‌, కాంగ్రెస్‌ యూత్‌ అధ్యక్షుడు చెట్కూరి కమలాకర్‌, మార్కెట్‌ కమిటీ డెరెక్టర్‌ కృష్ణ, నాచగోని వెంకట్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట రూరల్‌: సిద్దిపేట రూరల్‌ మండల పరిధిలోని చిన్నగుండవెల్లి, ఇర్కోడ్‌, తోర్నాల, చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్‌, గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ శ్రీదేవిచందర్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం విజయనిర్మల, ఎంపీపీ ఉపాధ్యక్షుడు శేరుపల్లి యాదగిరి, సర్పంచులు పాల్గొన్నారు.

చేర్యాల: కొమురవెల్లి మండలం మర్రిముచ్ఛాల, రాంసాగర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్ధప్ప ప్రారంభించారు.

Updated Date - 2023-05-02T23:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising