అర్హులకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందజేయాలి
ABN, First Publish Date - 2023-03-02T23:52:39+05:30
సీపీఐఎం నాయకుల డిమాండ్, ఆందోళన
జహీరాబాద్, మార్చి 2: జహీరాబాద్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులకు అందజేయాలని సీపీఐఎం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అర్హులకు అందడంలేదన్నారు. ప్రతిరోజు ఇళ్ల కోసం ప్రజలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ దరఖాస్తులతో తిరుగుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారన్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐఎం నాయకులు నర్సింహులు, పాల్గొన్నారు.
ఆర్డీవో, తహసీల్దార్‌కు పేదల వినతి
తూప్రాన్/మనోహరాబాద్: మనోహరాబాద్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలకే అందజేయాలని కోరుతూ పేదలు తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకా్‌షకు, మనోహరాబాద్ తహసీల్దార్ భిక్షపతికి గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. మనోహరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు అందజేయాలని 285 రోజులుగా పేదలు అందోళన చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కొందరికి పట్టాలు అందజేశారు. అయితే అర్హులకు అందజేయలేదని పేదలు ఆందోళన చేస్తూ, పేదలకు న్యాయం చేయాలని గురువారం ఆర్డీవోకు, తహసీల్దార్‌కు విన్నవించారు.
Updated Date - 2023-03-02T23:52:39+05:30 IST