ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడ, మగ తేడా చూపొద్దు

ABN, First Publish Date - 2023-01-07T23:12:01+05:30

జిల్లాలోని పోలీస్‌ అధికారులకు, రిసెప్షన్‌ వర్టికల్‌ సిబ్బందికి జెండర్‌ సెన్సిటైజేషన్‌పై స్వార్డ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం ఒక రోజు వర్క్‌షాపును నిర్వహించారు.

జెండర్‌ సెన్సిటైజేషన్‌ వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న సీపీ శ్వేత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మగవారి మైండ్‌సెట్‌ మారాలి

జెండర్‌ తేడా లేనప్పుడే సమాజ శ్రేయస్సు సాధ్యం

మహిళలు అన్ని రంగాల్లో ఉత్తమంగా రాణిస్తున్నారు

జెండర్‌ సెన్సిటైజేషన్‌పై వర్క్‌షాప్‌లో సీపీ శ్వేత

సిద్దిపేట క్రైం, జనవరి 7 : ఆడ, మగ అనే తేడా లేకుండా మగవారి మైండ్‌సెట్‌ మారాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత సూచించారు. జిల్లాలోని పోలీస్‌ అధికారులకు, రిసెప్షన్‌ వర్టికల్‌ సిబ్బందికి జెండర్‌ సెన్సిటైజేషన్‌పై స్వార్డ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం ఒక రోజు వర్క్‌షాపును నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ సమాజంలో కుల, మత భేదాలకు అతీతంగా స్త్రీ, పురుషులు అందరూ సమానమేనని, మన ప్రవర్తన కూడా అలానే ఉండాలని సూచించారు. మహిళల రక్షణకు రూపొందించిన అన్ని చట్టాలను గౌరవించాలని కోరారు. మహిళలకు సంబంధించిన కేసులలో స్నేహిత, సఖీ, భరోసా సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. వాటి ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పించాలన్నారు. మహిళలు గృహహింసకు, వేధింపులకు గురైతే వెంటనే స్నేహితకు సమాచారం అందించి కౌన్సెలింగ్‌ ద్వారా కాపురాలను నిలబెట్టవచ్చని వివరించారు. మహిళలకు ఏవైనా సమస్యలు ఉంటే స్నేహిత హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9494639498కు ఫోన్‌ చేసి వారి సహాయం పొందవచ్చని సూచించారు. ఆడ, మగ అనే తేడా లేకుండా సమానత్వంతో చూసినప్పుడే సమాజం, దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని సీపీ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. నేటితరం స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్వార్డ్‌ స్వచ్ఛంద సంస్థ సీఈవో శివకుమారి మాట్లాడుతూ ఆడ, మగ వివక్ష లేకుండా పిల్లలను పెంచాలని సూచించారు. సెక్స్‌, జెండర్‌ ఏ పదాల్లోకి వస్తాయో వివరించారు. సెక్స్‌ ప్రకృతి సైన్స్‌ నుంచి వచ్చిందని, జెండర్‌ సమాజం నుంచి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. జెండర్‌ ఈక్విటీ గురించి ప్రతీ ఒక్కరు పాటుపడాలని సూచించారు. సెక్స్‌/ జెండర్‌, ఈక్వాలిటీ/ ఈక్విటీ జెండర్‌ బేస్ట్‌ వయోలేషన్స్‌, కౌన్సెలింగ్‌, సూటేబులిటీ డెవల్‌పమెంట్‌ గోల్స్‌, రోల్‌ అండ్‌ రెస్పాన్సిబిలిటీ ఆఫ్‌ పోలీస్‌ పర్సన్స్‌ తదితర అంశాల గురించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, గజ్వేల్‌ ఏసీపీ రమేష్‌, ట్రాఫిక్‌ ఏసీపీ ఫణిందర్‌, ఎస్బీ ఏసీపీ రవీందర్‌ రాజు, సీఐలు ఎస్‌ఐలు రిసెప్షన్‌ వర్టికల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-07T23:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising