ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రె్‌సది ధనబలం.. మాది జనబలం

ABN, First Publish Date - 2023-10-03T00:16:23+05:30

అరవయ్యేళ్ల పాలనలో ఏం ఉద్ధరించారని కాంగ్రెస్‌ నాయకులు ఓట్ల కోసం వస్తున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి ఊసరవెల్లి మాటలు జనం నమ్మరు

తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి

ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు

రామాయంపేట/ నిజాంపేట, అక్టోబరు 2 : అరవయ్యేళ్ల పాలనలో ఏం ఉద్ధరించారని కాంగ్రెస్‌ నాయకులు ఓట్ల కోసం వస్తున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ధనబలంతో ఎన్నికల బరిలో దిగితే.. తాము మాత్రం జనబలాన్నే నమ్ముకున్నామని స్పష్టం చేశారు. రామాయంపేట పట్టణంలో రూ. 45 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మారెడ్డితో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. అంతకుముందు మండల కేంద్రమైన నిజాంపేటలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాయంపేటలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి మాట్లాడుతూ సోనియాను బలి దేవత అని విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కాంగ్రె్‌సలో చేరి తెలంగాణ దేవత అంటూ కొలుస్తున్నారని విమర్శించారు. ఊసరవెల్లిలా రంగులు మార్చిన ఆయన మాటలను ప్రజలు నమ్మబోరని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అర్ధరాత్రి కరెంటుకు ఎందరో రైతులు బలయ్యారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో కరెంటు చీకట్లు తొలగించి వెలుగులు నింపామని చెప్పారు. పొలాలకు పుష్కలంగా నీరందిస్తున్నామని అన్నారు. ఏడాదిలో రెండు పంటల సాగుకు సాయం అందజేస్తున్న తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమమే తనకు రాజకీయ ఓనమాలు నేర్పించిదని పేర్కొన్నారు. జడ్పీటీసీగా ఇక్కడి ప్రజల ఆశీస్సులతో గెలిచిన తనకు.. 2004లో కేసీఆర్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి గెలిపించుకున్నారని గుర్తుచేసుకున్నారు. తనను ఇబ్బందిపెట్టడం కోసం ఏడేళ్లుగా ఎందరో రామాయంపేట డివిజన్‌ కోసం ఉద్యమాలు చేశారని, తాను మాత్రం డివిజన్‌ సాధించాలనే తపనతోనే అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించగా సీఎం కేసీఆర్‌ స్పందించి డివిజన్‌ ఏర్పాటు చేశారని అన్నారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలకు రామాయంపేటలో బీఆర్‌ఎస్‌ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్ది మంగళహారతులిచ్చారు. పీర్లు, బోనాలతో పాత హైవే నుంచి ర్యాలీగా సభాస్థలికి తరలివచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రాజర్షిషా, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, నాయకులు జితేందర్‌గౌడ్‌, సిద్ధరాములు, చంద్రపాల్‌, బాధే చంద్రం, విజయలక్ష్మి, సరాఫ్‌ యాదగిరి, సంధ్య, మహేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-10-03T00:16:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising