ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

ABN, First Publish Date - 2023-03-25T23:11:54+05:30

వర్గల్‌, మార్చి 25: పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఎంపీపీ లతారమేశ్‌గౌడ్‌ అన్నారు.

ఎంపీపీ లతారమేశ్‌గౌడ్‌ను సన్మానిస్తున్న ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సునీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎంపీపీ జాలిగామ లతారమేశ్‌గౌడ్‌

పలు మండలాల్లో పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవాలు

వర్గల్‌, మార్చి 25: పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఎంపీపీ లతారమేశ్‌గౌడ్‌ అన్నారు. శనివారం వర్గల్‌ మండలం గిర్మాపూర్‌, నాచారం సెక్టర్‌ పరిధిలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు చిరుధాన్యాల మిట్లెట్స్‌ పోషకాహరంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సునీత, సర్పంచ్‌ సత్తయ్య, ఎంపీటీసీ జయమ్మ భీంరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వెంకటే్‌షగౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జగదేవ్‌పూర్‌: చిరుధాన్యాలతోనే ఆరోగ్యమని సీడీపీవో వెంకటరాజమ్మ అన్నారు. శనివారం జగదేవ్‌పూర్‌ సెక్టార్‌ ఆధ్వర్యంలో పోషణ్‌ పక్వాడ్‌ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా చిరుధాన్యాల ఆవశక్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ సునీత, ఎంఈవో ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, వైద్యాధికారి సత్యప్రకాష్‌, సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీటీసీ కవిత, అంగన్‌వాడీ టీచర్లు సంతోష, సుజాత, కవిత తదితరులు పాల్గొన్నారు.

మద్దూరు: పోహకారంతోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తామని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పుష్పలత తెలిపారు. శనివారం మద్దూరు మండలం మర్మాముల గ్రామంలో సర్పంచ్‌ సుందరగిరి స్రవంతి ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్‌వాడీ కార్యకర్తలకు మిల్లెట్‌ ఆహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising