ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీవీ ఓటుబ్యాంకు రాజకీయాలు

ABN, First Publish Date - 2023-06-26T00:18:29+05:30

జహీరాబాద్‌, జూన్‌ 25: హిందూ, ముస్లిం పేరుతో బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

జహీరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సాంబశివరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

జహీరాబాద్‌, జూన్‌ 25: హిందూ, ముస్లిం పేరుతో బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. జహీరాబాద్‌ పట్టణంలో రెండురోజులుగా ఆలిండియా తంజీం-ఎ ఇన్సాఫ్‌ మహాసభలను నిర్వహించారు. ఆదివారం ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విభజించు, పాలించు అనే విధానాన్ని పాటిస్తున్నదన్నారు. అందరి మధ్య పరస్పర విశ్వాసం ఉంటేనే సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీ హిందూ, ముస్లిం అనే విబేధాలను సృష్టిస్తున్నదని పేర్కొన్నారు. అమెరికా, తదితర దేశాలు బహుళ సంస్కృతితో కూడుకుని ఉంటే బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తూ మన మధ్య చిచ్చుపెడుతున్నదని చెప్పారు. అందరం కలిసి మెలిసి ఉండేవిధంగా ఆలిండియా తంజీం-ఎ ఇన్సాఫ్‌ కృషిచేస్తున్నదన్నారు. ముస్లింల వెనకబాటుతనాన్ని గుర్తించి గత పాలకులు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించగా.. కేంద్రమంత్రి అమిత్‌షా రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పడం హస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా తంజీం ఇన్సాఫ్‌ జాతీయ నాయకులు జలాలొద్దీన్‌, నాయకులు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising