చదువుతో పాటు కళలకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN, First Publish Date - 2023-09-22T00:11:47+05:30
వర్గల్, సెప్టెంబరు 21: తెలంగాణలో కళలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, ఆటల రూపంలో, పాటల రూపంలో కళాకరులు సమాజంలో జరుగుతున్న విషయాలను వివరిస్తూ మార్గదర్శకులు అవుతున్నారని, నేటి విద్యార్థులు చదువులతో పాటు కళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
వర్గల్ నవోదయ విద్యాలయంలో కళాఉత్సవ్ 2023-24 ప్రారంభం
వర్గల్, సెప్టెంబరు 21: తెలంగాణలో కళలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, ఆటల రూపంలో, పాటల రూపంలో కళాకరులు సమాజంలో జరుగుతున్న విషయాలను వివరిస్తూ మార్గదర్శకులు అవుతున్నారని, నేటి విద్యార్థులు చదువులతో పాటు కళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. వర్గల్ మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో రెండురోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ 2023-24 కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. నవోదయ విద్యాలయంలో అడుగు పెట్టగానే తెలంగాణ సంస్కృతిలో భాగమైన పోతరాజుల విన్యాస్యాలు, భోనాలు, బతుకమ్మలతో విద్యార్థులు స్వాగతం పలకడం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. పాఠ్య పుస్తకాలలో చదువులతో పాటు కళలకు ప్రాధాన్యం కల్పిస్తున్నరన్నారు. వేదికపై నుంచి ఆడపిల్లలను చూస్తుంటే బతుకమ్మలు కనబడుతున్నాయని, మగ పిల్లలను చూస్తుంటే దసరా పండుగ రోజును పాలపిట్టను చూసినట్లు కనిపిస్తున్నారని తెలిపారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ ఉంటుందని, దానిని వెలికిసిఇ ప్రదర్శించినప్పుడే గొప్ప కళాకారుడు అనిపించుకుంటాడన్నారు. పాడిన ప్రతి పాటలో అర్థాలతో పాటు ప్రేమ, జాలి, దయ కలిగి ఉండేవన్నారు. ఈ కార్యక్రమంలో నవోదయ విద్యాలయ సమితి అసిస్టెంట్ కమిషనర్ అభిజిత్ బెర, ప్రిన్సిపాల్ రాజేందర్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కళా ఉత్సవ్‌లో ఆకట్టుకున్న ప్రదర్శనలు
ఈ ఉత్సవాల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 9 నవోదయ విద్యాలయాల్లోని 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన శాస్ర్తీయ సంగీతం, కర్ణాటక హిందుస్థానీ, సంప్రదాయ తెలంగాణ జాతీయ జానపద గాత్ర సంగీతం, శాస్త్రీయ వాద్య సంగీతం, దేశీయ వాద్య సంగీతం, శాస్త్రీయ నృత్యాలు (క్లాసికల్ డాన్స్), జానపద నృత్యం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, శిల్పకళ, మట్టితో బొమ్మలు తయారు చేయడం, స్థానిక బొమ్మల తయారీ, ఏకాంకిక ఏకపాత్రాభినయం ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Updated Date - 2023-09-22T00:11:47+05:30 IST