ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల పన్నులు కాంట్రాక్టు సిబ్బంది వేతనాలకేనా?

ABN, First Publish Date - 2023-03-25T23:28:43+05:30

మున్సిపల్‌ సమావేశంలో కౌన్సిలర్ల వాదన

నర్సాపూర్‌ మున్సిపల్‌ సమావేశంలో కౌన్సిలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నర్సాపూర్‌, మార్చి 25: నర్సాపూర్‌ మున్సిపాలిటీలో అవసరానికి మించి కాంట్రాక్టు సిబ్బందిని ఇష్టానుసారంగా నియమించడంపై పలవురు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మాట్లాడారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల్లో అధిక భాగం కాంట్రాక్టు సిబ్బంది వేతనాలకే వెచ్చిస్తున్నారని, పట్టణ అభివృద్ధికి సాధారణ నిధులతో ఏమి చేయలేకపోతున్నామని పలువురు కౌన్సిలర్లు వాపోయారు. మున్సిపాలిటీ కార్యాలయంలో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని తొలగించాలని కౌన్సిలర్లు కోరారు. సమావేశం ఏర్పాటు చేసి తీర్మాణాలు చేయడం తప్పా పనులు కావడం లేదని పలువురు విమర్శించారు. తమ తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు సమావేశంలో వినిపించారు. సమావేశంలో కమిషనర్‌ వెంకట్‌గోపాల్‌, వైస్‌ చైర్మన్‌ నయీమొద్దీన్‌, కౌన్సిలర్లు లతరమే్‌షయాదవ్‌, ఇస్రత్‌సిద్దిఖీ, యాదగిరి, సురేష్‌, రామచందర్‌, సునీతాబాల్‌రెడ్డి, బుచ్చే్‌సయాదవ్‌, రాజేందర్‌, లక్ష్మినగేష్‌, సరితఆంజనేయులుగౌడ్‌, లలితభిక్షపతి, ఎఫ్‌ఆర్‌వో అంబర్‌సింగ్‌, పీఆర్‌ ఏఈ స్వామిదాస్‌, మేనేజర్‌ మధుసుదన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ లక్ష్మిప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:28:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising