పట్టుదల ఉంటే లక్ష్యసాధన సమస్యే కాదు
ABN, First Publish Date - 2023-02-21T00:29:48+05:30
విద్యార్థులకు లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉంటే, గమ్యం చేరడం సమస్య కాదని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు పేర్కొన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు
మిరుదొడ్డి, పిబ్రవరి 20: విద్యార్థులకు లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉంటే, గమ్యం చేరడం సమస్య కాదని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు పేర్కొన్నారు. సోమవారం మిరుదొడ్డి మండలం అల్వాలా గురుకుల పాఠశాల సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నతస్థాయికి చేరారన్నారు. అల్వాలా గురుకుల పాఠశాల విద్యార్థుఽలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కారని గుర్తు చేశారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధించాలనీ ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జెల సాయిలు, డీసీసీబీ సభ్యులు బక్కి వెంకటయ్య, ఆత్మకమిటీ చైర్మన్ భాస్కరాచారి, సర్పంచు బాలనర్సింహులు, ప్రిన్సిపాల్ ధనలక్ష్మి తదితరులున్నారు
Updated Date - 2023-02-21T00:29:50+05:30 IST