ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణలో ప్రసూతి మరణాలు తక్కువ

ABN, First Publish Date - 2023-06-26T01:56:27+05:30

తెలంగాణలో ప్రసూతి మరణాల సంఖ్య తక్కువగా ఉన్నదని, ఇక్కడి వైద్య విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే ప్రసూతి మరణాల సంఖ్య తగ్గుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8 దళిత జర్నలిస్టులందరికీ దళితబంధు ఇస్తాం: హరీశ్‌రావు

సిద్దిపేట అర్బన్‌/సిద్దిపేట టౌన్‌, జూన్‌ 25: తెలంగాణలో ప్రసూతి మరణాల సంఖ్య తక్కువగా ఉన్నదని, ఇక్కడి వైద్య విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే ప్రసూతి మరణాల సంఖ్య తగ్గుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఆదివారం జరిగిన రాష్ట్ర ఆయుష్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే 60ు ప్రసూతి మరణాలు సంభవించే పది దేశాలలో మనదేశం పేరు ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయుర్వేదిక్‌ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. 1,200 మంది ఆయుర్వేదిక్‌ డాక్టర్లకు ఏకకాలంలో ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని పేర్కొరు. ప్రస్తుతానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీ డయాగ్నస్‌ కింద 57 ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, త్వరలోనే 134 పరీక్షలకు అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు.

అంబేడ్కర్‌ వల్లే ఈ పదవులు

అంబేడ్కర్‌ కల్పించిన రిజర్వేషన్ల వల్లే ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, మంత్రు లం అవుతున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఇంటర్నేషనల్‌ దళిత జర్నలిస్టు నెట్‌వర్క్‌ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పాల్గొన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గాల్లో దళిత జర్నలిస్టులకు దళితబంధు ఇస్తామని హామీనిచ్చారు.

Updated Date - 2023-06-26T01:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising