ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MARGADARSHI M.D. On Shailaja: మార్గదర్శి ఎం.డి. శైలజపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేయలేదు

ABN, First Publish Date - 2023-06-02T02:32:01+05:30

విదేశాలకు వెళ్లిన మార్గదర్శి ఎం.డి. శైలజ పై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్వోసీ) జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టుకు తెలిపిన కేంద్రం

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): విదేశాలకు వెళ్లిన మార్గదర్శి ఎం.డి. శైలజ పై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్వోసీ) జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఏపీలోని మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ శాఖలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తుకు సహకరిస్తున్నప్పటికీ తనపై ఎల్వోసీ జారీ చేశారని, దానిని కొట్టేయాలని శైలజ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ కె. శరత్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వ న్యాయవాది లలిత గాయత్రి వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ ఎలాంటి అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అనురాగ్‌ వాదనలు వినిపిస్తూ.. శైలజపై ఎల్‌వోసీ జారీ చేయలేదని చెప్పారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తునకు సహకరించినా హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ సిఐడి వ్యవహరించిందని ఆరోపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యంతర పిటిషన్‌లపై తీర్పు వెల్లడిస్తానని పేర్కొంది.

Updated Date - 2023-06-02T03:47:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising