మమ.. అనిపించేందుకే కోవింద్ కమిటీ
ABN, First Publish Date - 2023-09-04T04:15:40+05:30
జమిలి ఎన్నికల పేరిట మోదీ సర్కారు దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు.
జమిలి మంచిదే.. చర్చ జరగాలి: వినోద్‌కుమార్
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జమిలి ఎన్నికల పేరిట మోదీ సర్కారు దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ ఎన్నికల అంశంపై పదేళ్లుగా మాట్లాడని ఎన్‌డీఏ సర్కారు హడావుడిగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తప్పుబట్టారు. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కమిటీ వేయడం ఆశ్చర్యకరమన్నారు. జమిలి ఎన్నికలపై ఇప్పటికే నివేదిక సిద్ధం అయిందా? ఇప్పుడు వేసిన కమిటీ నామ్ కే వాస్తేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. అంతా సిద్ధం చేసుకుని మమ.. అనిపించుకునేందుకే కమిటీ వేశారని, అసలేం జరుగుతుందో మోదీకి తప్ప బీజేపీలో ఉన్న వారికీ తెలియదన్నారు. జమిలి ఎన్నికల అధ్యయన కమిటీలో అంతా ఉత్తర భారతదేశ సభ్యులే ఉన్నారని, దక్షిణాది నుంచి ఒక్కరూ లేకపోవడం శోచనీయమన్నారు. 2018లోనే జమిలి ఎన్నికలపై బీఆర్‌ఎస్ అభిప్రాయం చెప్పామని, ఈ ఎన్నికలు మంచివే కానీ చర్చ జరగాలని లా కమిషన్‌కు వెల్లడించామన్నారు.
Updated Date - 2023-09-04T04:16:40+05:30 IST