‘కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2023-01-18T00:34:53+05:30
రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పథి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ అధికారులతో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈ నెల 18న కంటి వెలుగును ప్రారంభిస్తారని తెలిపారు. 19న ఉద యం 9గంటలకు జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
కలెక్టర్ పమేలా సత్పథి
భువనగిరి అర్బన్, జనవరి 17 : రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలాసత్పథి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ అధికారులతో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈ నెల 18న కంటి వెలుగును ప్రారంభిస్తారని తెలిపారు. 19న ఉద యం 9గంటలకు జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లా లో 18 ఏళ్లు నిండిన 6,7,337మందికి పరీక్షలు నిర్వహించడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. అందుకోసం 34 బృందాలు, 2బఫర్ టీంలను ఏర్పాటుచే శామన్నారు. 421 పంచాయతీలు, 104 మునిసిపల్ వార్డుల్లో 525 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా కేంద్రాల్లో పరీక్షలు చేస్తారన్నారు. శిబిరంలో అద్దాలు అవసరమైన వారిని గుర్తించి 15 రోజుల్లో ఆశా సిబ్బంది వాటిని ఇంటికి చేరుస్తారన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఇప్పటికే 3,33,400 రీడింగ్ అద్దాలు జిల్లాకు రాగా, వీటిలో 75 శాతం పీహెచ్‌సీలకు చేరవేశామన్నారు. ప్రతి రోజూ 150 మందికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శిబిరాలను కలెక్టర్, అదనపు కలెక్టర్లు కూడా తనిఖీలు నిర్వహిస్తారన్నారు. అదేవిధంగా అధికారులు ఐదు నుంచి ఆరు శిబిరాలను తనిఖీ చేస్తారని, మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారన్నారు. ప్రతి శనివారంతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో శిబిరాలు ఉండవన్నారు. పరీక్షలు చేయించుకునే వారు తప్పనిసరిగా తమ ఆధార్‌కార్డులను వెంట తెచ్చుకోవాలన్నారు. అదేవిధంగా 18004257106, 8685293312 నెంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, జడ్పీ సీఈవో సీహెచ్ కృష్ణారెడ్డి, డీఆర్డీఏ మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కొన్ని అభియోగాల మేరకు మూసివేసిన ఆస్పత్రులను త్వరగా తెరవడమేంటని విలేకరులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా వైద్యాధికారి వివరణ ఇస్తారని కలెక్టర్ చెప్పగా, కొత్త పేరుతో ఆస్పత్రులను తెరుస్తున్నారని మల్లికార్జునరావు తెలిపారు.
అప్‌లోడింగ్ పనుల పరిశీలన
కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాంలో కొత్తగా భద్రపరిచిన 1,808 ఈవీఎంలను స్కానింగ్, సాఫ్ట్‌వేర్ అప్‌లోడింగ్ పనులను కలెక్టర్ పమేలాసత్పథి మంగళవారం పరిశీలించారు. కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి బట్టు రామచంద్రయ్య, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ గిరిధర్, డిప్యూటీ తహసీల్దార్ సురేష్ పాల్గొన్నారు.
25లోగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి : కలెక్టర్
డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఈ నెల 25న తుది జాబితాను సమర్పించాలని కలెక్టర్ పమేలాసత్పథి తహసీల్దార్లను ఆదేశించారు. కాన్ఫరెన్స్ హాల్‌లో తహసీల్దార్, మండల ప్రత్యేక అధికారులు, ఆర్‌అం డ్‌బీ, పంచాయతీరాజ్ ఇంజనీర్లతో ఆమె సమీక్షించారు. గ్రామసభలో ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఎంపిక విధానం పారదర్శకంగా ఉండాలన్నారు. నిజమైన అర్హులకు ఈ ఇళ్లు దక్కాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దీపక్‌తివారీ, డి.శ్రీనివా్‌సరెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, సీపీవో మాన్యానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా సహకార అధికారి పరిమళాదేవి, ఉద్యానశాఖ అధికారి అన్నపూర్ణ, అడిషనల్ డీఆర్డీఏ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ఏడీ నీలిమ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగలక్ష్మీ, పం చాయతీరాజ్ డీఈఈ గిరిధర్, అర్‌అండ్‌బీ ఇంజనీర్ అలీ, తహసీల్దార్లు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-18T00:34:58+05:30 IST