ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మైనంపల్లి ఇన్‌.. ఇద్దరు డీసీసీ అధ్యక్షులు అవుట్‌

ABN, First Publish Date - 2023-10-03T03:50:13+05:30

అటు చేరికలతో సందడిగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి.. ఇటు రాజీనామాలూ తలనొప్పిని తెప్పిస్తున్నాయి.

కాంగ్రెస్‌కు మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ రాజీనామా

ఆదివారమే రాజీనామా చేసిన మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): అటు చేరికలతో సందడిగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి.. ఇటు రాజీనామాలూ తలనొప్పిని తెప్పిస్తున్నాయి. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌ల చేరికతో మల్కాజ్‌గిరి, మెదక్‌ నియోజకవర్గాల్లో పార్టీకి జోష్‌ వచ్చిందన్న భావనలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. అయితే వారి చేరికను వ్యతిరేకిస్తూ ఆదివారం మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సోమవారం మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మల్కాజ్‌గిరి టిక్కెట్టుపై ఆశలు పెట్టుకున్న నందికంటి శ్రీధర్‌.. మైనంపల్లి చేరికతో అసంతృప్తి చెందారు. మైనంపల్లిని పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ తదితరులు ముందుగా నందికంటి శ్రీధర్‌ ఇంటికి వెళ్లి బుజ్జగించారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఆయన్ను రాహుల్‌ గాంధీ వద్దకు తీసుకెళ్లి అవసరమైన హామీనీ ఇప్పించారు. అంతా సద్దుమణిగిందనుకుంటున్న దశలో... తన రాజీనామాతో శ్రీధర్‌ షాకిచ్చారు. అలాగే మైనంపల్లి కుమారుడు రోహిత్‌కు మెదక్‌ సీటును అధిష్ఠానం దాదాపు ఖరారు చేయడంతో ఆ సీటును ఆశిస్తున్న తిరుపతిరెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. ఇద్దరు నేతలూ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తాను 1994 నుంచి కాంగ్రెస్‌ పార్టీలోనే అంకితభావం, విధేయతతో పనిచేస్తున్నానని. బీసీ వర్గానికి చెందిన తాను 2018లో పార్టీ అలయన్స్‌లో భాగంగా టిక్కెట్‌ మిత్రపక్షాలకు ఇచ్చినా పనిచేశానని నందికంటి శ్రీధర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘2023లో టిక్కెట్‌ వస్తుందని భావించాను.. పార్టీ కూడా హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఉదయపూర్‌ డిక్లరేషన్‌లో కుటుంబంలో ఒకరికి మాత్రమే టిక్కెట్‌ ఇస్తామని ప్రకటించినా మైనంపల్లి హనుమంతరావు కుటుంబసభ్యులకు మల్కాజిగిరి, మెదక్‌లో రెండు టిక్కెట్లు కేటాయించడం బాధించింది.’’ అని లేఖలో తెలిపారు. కాంగ్రె్‌సలో బీసీలకు న్యాయం జరగదని భావించి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2023-10-03T03:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising