ప్రతిభతో రాణించి ఉన్నత శిఖరాలు చేరాలి
ABN, First Publish Date - 2023-06-26T00:04:29+05:30
నిరంతరం శ్రమ, కఠోర దీక్షతో విద్యాభాస్యం సా గిస్తూ ప్రతిభను చాటుతూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలంగా ణ వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప విద్యార్థులకు సూచించారు.
- వినియోగదారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ గట్టు తిమ్మప్ప
- ప్రతిభావంత విద్యార్థులకు పురస్కారాలు
గద్వాల టౌన్, జూన్ 25 : నిరంతరం శ్రమ, కఠోర దీక్షతో విద్యాభాస్యం సా గిస్తూ ప్రతిభను చాటుతూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలంగా ణ వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప విద్యార్థులకు సూచించారు. ఆదివారం పట్టణంలోని వాల్మీకి భవనంలో వాయిస్ నంద్యాల సంస్థ, జిల్లా వాల్మీకి బోయ ఉద్యగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభావంత విద్యార్థుల పురస్కార ప్రదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మా ట్లాడారు. పవిత్ర రామాయణ ఇతిహాసాన్ని భరత జాతికి అందించిన వాల్మీకి వా రసులుగా చెప్పుకునే కులబాందవులు చిన్నారులు అన్ని విషయాల పట్ల ఆసక్తిని అవగాహనను పెంచుకుని ఉన్నత విద్యావంతులగా రాణించాలన్నారు. కార్యక్ర మంలో పాల్గొన్న ఆల్ ఇండియా డాక్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రామచంద్రనాయుడు మాట్లాడుతూ పట్టుదల, ఏకాగ్రత, విద్యపట్ల ఆసక్తి ఉంటే ఉన్నత స్థానాలు దక్కించుకోవడం అసాధ్యమేమి కాదన్నారు. ప్రతిభకు కుటుం బ నేపథ్యం, ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఎలాంటి అవరోధం కాదని, కావాల్సిం దల్లా లక్ష్యసాధన పట్ల చిత్తశుద్ధి మాత్రమేనని విద్యార్థులకు ఉద్భోదించారు. ఇటీ వల ప్రకటించిన ఇంటర్మీడియట్, ఎస్‌ఎస్‌సి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబ రచిన (ఇంటర్ లో ముగ్గురు), (ఎస్‌ఎస్‌సిలో 40) మందికి విద్యార్థులకు రూ.1500ల నగదు బహుమతితో పాటు ఎగ్జిక్యూటీవ్ ఫైల్, డిక్షినరీ, పతకం, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో వాయిస్ నంద్యాల ట్రస్ట్ అధ్యక్షుడు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి లోకేష్‌కుమార్, రాష్ట్ర ఐక్యవాల్మీకి కమిటీ సభ్యుడు వైండింగ్ రాములు, జిల్లా న్యాయ సలహాదారుడు మధుసూదన్‌బాబు, వాల్మీకి సేవా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోటేష్, మురళి, వాల్మీకి నా యకులు రంగన్న, ఎల్లస్వామి, అశోక్‌కుమార్, నరసింహులు, సవారన్న, దేవదాసునాయుడు, సద్దల రాములు, విష్ణు, పచ్చర్ల శ్రీనివాస్ ఉన్నారు.
Updated Date - 2023-06-26T00:04:29+05:30 IST