ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగసముద్రం రిజర్వాయర్‌ లాంచీ మరమ్మతు జరిగేనా.?

ABN, First Publish Date - 2023-03-02T23:12:56+05:30

శ్రీరంగనాయక స్వామి టెంపుల్‌ ప్రాంతాన్ని, రంగసముద్రం బ్యా లెన్సింగ్‌ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్ధేశంతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మొదటి దశగా జనవరి 25న ఒక లాంచీ, ఒక స్పీడ్‌ బోటును ప్రారంభించారు.

రంగసముద్రంలో మరమ్మతుకు నోచుకోని లాంచీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీరంగాపురం, మార్చి 2 : శ్రీరంగనాయక స్వామి టెంపుల్‌ ప్రాంతాన్ని, రంగసముద్రం బ్యా లెన్సింగ్‌ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్ధేశంతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మొదటి దశగా జనవరి 25న ఒక లాంచీ, ఒక స్పీడ్‌ బోటును ప్రారంభించారు. 30 మంది కెపాసిటీ ఉన్న లాంచీని స్వయంగా మంత్రి నిరంజన్‌రెడ్డి రంగ సముద్రంలో నడిపించారు. అయితే, ప్రారంభమైన మూడురోజులకే ఆ లాంచీ మరమ్మతుకు గురైంది. నాటి నుంచి నేటివరకు టూరిజం అధికారులు గానీ, సిబ్బంది గానీ దాని గురించి పట్టించుకోలేదు. విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ తెలంగాణ టూరిజం శాఖ ఎండి మనోహర్‌ దృష్టికి దాదాపు మూడుసార్లు తీసుకెళ్లినా నేటికీ మరమ్మతుకు నోచుకోలేదు. మూడురోజుల క్రి తం రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ప్రారంభమైంది. టూరిజం శాఖ అధికారులు వెంటనే స్పందించి లాంచీ, బోటును తిరిగి ప్రారంభించాలని పర్యాటకులు, భక్తులు, గ్రామస్థులు కోరారు. అదే విధంగా, లాంచీ, బోటు ఎక్కడానికి తాత్కాలిక మెట్లను ఏర్పాటు చేయాలని, దీంతో పాటు ఆరేళ్ల క్రితం నిర్మించిన టూరిజం రెస్టారెంట్‌ను ప్రారంభించాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2023-03-02T23:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!