ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN, First Publish Date - 2023-08-02T23:36:02+05:30

v

రెండో విడత గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

- రెండో విడత గొర్రెల పంపిణీ

నర్వ, ఆగస్టు 2 : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో కుర్మ యాదవులకు మంజూరైన రెండో విడత 24 గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెలే మాట్లాడుతూ మిగిలిన వారికి కూడా మూడో విడతో గొర్రెల యూనిట్లను అందిస్తామన్నారు. అదే విధంగా అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, దళితబంధు అందజేస్తామన్నారు. ఈనెల 15 నుంచి బీసీ బంధు చెక్కులను అందిస్తామన్నారు. అనంతరం ఆ సంఘం మండలాధ్యక్షుడు అయ్యప్పయాదవ్‌, శేఖర్‌ యాదవ్‌ ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సన్మానించారు. జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాస్‌, పశువైద్యాధికారి అశోక్‌కుమార్‌, ఎంపీపీ జయరాములు శెట్టి, పీఎసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ లక్ష్మణ్‌, జడ్పీటీసీ సభ్యురాలు గౌని జ్యోతి, వైస్‌ ఎంపీపీ దండు వీణావతి, మండలాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మండ్ల చిన్నయ్య, దండు అయ్యప్ప, డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, హన్మంత్‌రెడ్డి, గడ్డం నర్సింహ్మ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి..

కృష్ణ/మాగనూరు : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కృష్ణ మండలం ఖాన్‌దొడ్డి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. సర్పంచులు విజయలక్ష్మి, శివప్ప, ఎంపీటీసీ సభ్యుడు రామచంద్ర, విజయప్పగౌడ, మోనేష్‌, కోఆప్షన్‌ సభ్యులు అబ్దుల్‌ ఖాదర్‌, మహిపాల్‌రెడ్డి, తిప్పయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అదే విధంగా మాగనూరు మండలం బైరంపల్లి గ్రామ రహదారికి రూ.65 లక్షలతో ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఎంపీటీసీ సభ్యుడు ఎల్లారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, సర్పంచు మంజుల, ఉప సర్పంచు నవీన్‌, రాఘవేంద్ర, పురుషోత్తంగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T23:36:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising