సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తాం
ABN, First Publish Date - 2023-06-07T00:13:28+05:30
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరి స్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నిమోజకవర్గంలో కొనసాగు తోంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల స్థానికతను కోల్పోయేలా ప్రభుత్వం తెచ్చిన 317 జీవోను రద్దు చేస్తామ న్నారు.
అచ్చంపేట, జూన్ 6: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరి స్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నిమోజకవర్గంలో కొనసాగు తోంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల స్థానికతను కోల్పోయేలా ప్రభుత్వం తెచ్చిన 317 జీవోను రద్దు చేస్తామ న్నారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు చేసిన పాదయాత్రలో ప్రతీ గ్రామంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెడుతున్న తప్పుడు కేసుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న డీఎస్పీ మొదలుకొని ఎస్‌ఐ వరకు ఉన్నతాధికారుల ఆదేశాలను కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలను అమలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు చెప్పినట్లు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదని, ప్రజల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలను నాశనం చేయొద్దని అన్నారు. సీఎం కేసీఆర్ నాగర్‌కర్నూల్ రాక సందర్భంగా ఇళ్లల్లో కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిర్భయంగా ప్రజల మధ్యన తిరిగే వాళ్లే అసలైన ప్రజా ప్రతినిధులని అన్నారు. బీఆర్‌ఎస్‌ను మూట కట్టి బంగాళాఖాతంలో వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు డా.వంశీకృష్ణ, నాయకులు బాలునాయక్ పాల్గొన్నారు.
Updated Date - 2023-06-07T00:13:28+05:30 IST