ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తండాలను గ్రామ పంచాయతీలు చేశాం

ABN, First Publish Date - 2023-08-30T23:24:08+05:30

మా తండాలో మా రాజ్యం అంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసినా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు.

దేవునిగుట్టతండాలో పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి

జడ్చర్ల, ఆగస్టు 30 : మా తండాలో మా రాజ్యం అంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసినా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని దేవునిగుట్టతండాలో బుధవారం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేయడంతో పాటు అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌ను ఆదరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాలే పట్టుకొమ్మలని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం తండాలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. జడ్చర్ల మునిసిపాలిటీలోని 14వ వార్డు, త్రిశూల్‌నగర్‌ కాలనీలో రూ.30లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. దేవునిగుట్టతండా సర్పంచ్‌ రామునాయక్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి, బాదేపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ సుదర్శన్‌గౌడ్‌, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ కొంగళి జంగయ్య, సర్పంచ్‌లు ప్రణీల్‌చందర్‌, సుందర్‌, ముడా డైరెక్టర్‌లు ఇంతియాజ్‌ఖాన్‌, శ్రీకాంత్‌, కౌన్సిలర్‌లు పుష్పలత, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రఘుపతిరెడ్డి, తండావాసులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో చేరికలు

రాజాపూర్‌ : మండలంలోని కల్లేపల్లి, అగ్రహారంపొట్లపల్లి గ్రామాల్లోని పలు పార్టీలకు చెందిన నాయకులు బుధవారం జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారికి బీఆర్‌ఎస్‌ పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-30T23:24:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising