ఐలమ్మ అడుగు జాడల్లో నడవాలి
ABN, First Publish Date - 2023-09-26T23:11:02+05:30
చాకలి ఐలమ్మ అడుగు జాడల్లో నడవాలని జల్లా పరిషత్ చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సరిత అన్నారు.
- జయంతి వేడుకల్లో జడ్పీ చైర్‌పర్సన్ సరిత
- నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
ధరూరు/ గద్వాల న్యూటౌన్/ గద్వాల టౌన్/ గట్టు/ రాజోలి/ వడ్డేపల్లి/ మానవపాడు/ ఇటిక్యాల/ అయిజ/ రాజోలి, సెప్టెంబరు 26 : చాకలి ఐలమ్మ అడుగు జాడల్లో నడవాలని జల్లా పరిషత్ చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సరిత అన్నారు. తెలం గాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ధరూరు మండలంలోని ఉప్పేరు లో ఐలమ్మ విగ్రహానికి జడ్పీ చైర్‌పర్సన్ సరిత పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కాం గ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, మోతీలాల్, ఆనంద్‌గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాలు, రజకసంఘం నాయకులు పెద్ద కోటన్న, ఆంజనేయులు, నరసింహులు, చిన్న కోటన్న, గోపాల్, మశన్న, రంజిత్ గౌడ్, సతీష్, అశోక్, శ్రీను పాల్గొన్నారు.
గూండాలను తరిమి కొట్టిన వీరవనిత
గూండాలను తరిమికొట్టి పంటను కాపాడుకున్న వీరవనిత చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా గద్వాల పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఎంపీపీ విజయ్, జడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పోరాట యోధురాలు
భూమి కోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం రైతులను, కూలీలను ఏకం చేసిన తెలం గాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ అని ఎమ్మెల్యే అబ్రహాం కొనియాడారు. శాంతినగర్ లోని ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆర్డీఎస్ ఆయకట్టు దారుల సంఘం మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కాశపోగు రాజు, ఎంపీపీ రజితమ్మ, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు ఆంజనేయులు, తిమ్మప్ప, మార్కెట్‌యార్డ్ డైరెక్టర్ మహేష్, వీరేష్, నగేష్, టీచర్ రామ్మోహన్, జేమ్స్, శేఖర్, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
స్ఫూర్తిదాయకం
గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ వీరత్వం నేటితరం మహిళలకు స్ఫూర్తిదాయక మని మహరాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే.సుకుమార్ కొని యాడారు. పట్టణంలోని ఎంఏఎల్‌డీ కళాశాలలో ఐల మ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ పి.లవీన మంజులత, మేడిచర్ల హరినాగభూషణం, శంకర్, వెంకటేశ్వర్లు, రాములు, ఏవో మక్బూల్ అహ్మద్, సూపరింటెండెంట్ రమేష్ పాల్గొన్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వ హించారు. సంఘం రాష్ట్ర కన్వీనర్ పేపర్ నరసిం హులు, నాయకులు బి.నరసింహులు, అశోక్, మొల్కల పల్లి నరసింహులు, సవారన్న, సిద్ధు పాల్గొన్నారు.
విముక్తి పోరాటాలకు స్ఫూర్తి
వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో తన సాహసాన్ని చూపిన చాకలి ఐలమ్మ నేటి సమాజంలో సాగుతున్న విముక్తి పోరాటాలకు స్ఫూర్తి అని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుడు మధుసూదన్ బాబు అన్నారు. పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆర్.మోహన్, వాల్మీకి, వెంకటస్వామి, గోపాల్‌రావు, ఎండీ సుభాన్, కోళ్ల హుసేన్ ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా వేడుకలు
- తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని సీనియర్ నాయకుడు దామోదర్‌రెడ్డి, రజక సంఘం నాయకులు తిక్కన్న, నాగన్న అన్నారు. మానవపాడు గ్రామ పంచా యతీ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు అక్బర్, పరమేష్, నరసింహ, రంగన్న, భరత్, సురేష్, రమేష్ రాజు పాల్గొన్నారు.
- ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా లో రజకసంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో చాకలి కృష్ణ, మౌలాలి, బుచ్చన్న, ఆంజ నేయులు, భూపతి, రాముడు, విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకటే శ్వర్‌రెడ్డి, గోవర్ధన్, నవాబు, రాఘవేంద్ర పాల్గొన్నారు.
- అయిజ తహసీల్దార్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి తహసీల్దార్ షాహెదాబేగం పూలమాల వేసి నివాళి అర్పించారు.
- గట్టు తహసీల్దార్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీని వాసులు, న్యాయవాది మోనయ్య పాల్గొన్నారు.
- రాజోలి బస్టాండులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద చాకలి ఐలమ్మ చిత్రపటానికి మాజీ సర్పంచు శ్రీరామ్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు నాగన్న, ఈరన్న, బజారి, భాస్కర్, వెంకటేష్, కేవీపీఎస్ మండల కార్యదర్శి విజయ్‌కుమార్, చేనేత కార్మికులు దూళ్ల రాముడు, మధు పాల్గొన్నారు.
ఐలమ్మ ఆశయ సాధనకు కృషి : కలెక్టర్
వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని, ఆమె ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి, ఉద్యమ స్పూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, చీర్ల శ్రీనివాస్, బీసీ సంక్షేమాధికారి శ్వేత ప్రియదర్శిని, ఏవో భద్రప్ప పాల్గొన్నారు.
వీరత్వానికి ప్రతీక ఐలమ్మ : ఎస్పీ
తెలంగాణ మహిళల చైతన్యానికి, వీరత్వానికి చాకలి ఐలమ్మ పోరాటం ప్రతీకగా నిలిచిందని ఎస్పీ సృజన అన్నారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐల మ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల తరుపున పెత్తందార్లతో పోరాడిన ఐలమ్మ ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.రవి, సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియేల్, కార్యాలయ ఏవో సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-09-26T23:11:07+05:30 IST