ఘనంగా వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి
ABN, First Publish Date - 2023-04-30T22:54:20+05:30
నారాయ ణపేట సింగార్‌బేస్‌లోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా ఆదివారం అమ్మవారికి అభిషేకం, డోలారోహణం, కుంకు మార్చన నిర్వహించారు.
నారాయణపేట/ధన్వాడ/మక్తల్, ఏప్రిల్ 30 : నారాయ ణపేట సింగార్‌బేస్‌లోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా ఆదివారం అమ్మవారికి అభిషేకం, డోలారోహణం, కుంకు మార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సుశీలేంద్ర, అవినాశ్, గిరీష్, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
- ధన్వాడ మండల కేంద్రంలో ఆదివారం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీమాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీ మాత చిత్ర పటంతో గ్రామంలో పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం వేంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు. ఎంపీటీసీ సభ్యుడు ఉమేష్‌కుమార్‌గుప్తా, ఉంద్యాల రాములు, సుంకు నర్సిములు, బద్రినాథ్, ఉంద్యాల చంద్రశేఖర్, జయశంకర్, సుంకు వీరేష్, సాయిబాబ పాల్గొన్నారు.
- మక్తల్ పట్టణంలో ఆదివారం వాసవీమాత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పడమటి ఆంజనేయస్వామి ఆలయం నుంచి వాసవీ మాత ఆలయం వరకు ఆదిశేష వాహనంపై అమ్మవారి ఊరేగింపు, మహిళల కలశ ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద సామూహిక కుంకు మార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం రథో త్సవం నిర్వహించారు. ఆలయ చైర్మన్ కొత్త శ్రీని వాస్‌గుప్తా, కట్ట సురేష్‌కుమార్, మన్సాని నాగరాజు, బి.భాస్కర్, నర్సయ్య, వట్టం రతన్‌కుమార్ గుప్తా, పొర్ల వెంకటేష్, హరికృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2023-04-30T22:54:20+05:30 IST