సావిత్రీబాయి పూలేకు ఘన నివాళి
ABN, First Publish Date - 2023-03-10T23:35:53+05:30
సావిత్రీబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఓ ఎంఐఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
నారాయణపేట టౌన్/మక్తల్/రూరల్, మార్చి 10 : సావిత్రీబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఓ ఎంఐఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సంస్థ సభ్యు లు ఎండీ జోషి, హాజమ్మ, బిందు, రాణి, నారాయణ, నర్సింహులు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
- మక్తల్ పట్టణంలో సావిత్రీబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భం గా పూలే సంఘం నాయకుడు వాకిటి ఆంజనేయులు, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంఘం జిల్లా నాయకుడు రాజు సాగర్ మాట్లాడారు. భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి, నిమ్న వర్గాల అభివృద్ధికి, స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రీబాయి అని కొనియాడారు. జక్లేర్ న్యూ శాంతినికేతన్ పాఠశాలలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయకర్త బిజ్వార్ మహేష్‌గౌడ్ సావి త్రీబాయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వామ్య, మత వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాస్వా మ్య వ్యవస్థ కోసం పాటుపడిన తొలి మహిళ అని కొనియాడారు. కార్యక్రమంలో మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ సంఘం నాయకులు వెంకటేష్‌గౌడ్, బం డారి భీమేష్, కోరి వెంకటేష్, కొల్మి కృష్ణ, తిరుపతి, బాలు, హైమాత్, రవికుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2023-03-10T23:35:53+05:30 IST