నల్లమలలో పర్యాటకుల సందడి
ABN, First Publish Date - 2023-08-12T23:13:28+05:30
: శని, ఆదివారాలు వరుసగా సెలవు దినాలు కావడంతో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండతో పాటు, ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులంతా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలుతున్నారు.
- వాహనాల రద్దీతో టోల్‌కు అధిక ఆదాయం
మన్ననూర్, ఆగస్టు 12 : శని, ఆదివారాలు వరుసగా సెలవు దినాలు కావడంతో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండతో పాటు, ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులంతా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలుతున్నారు. దీంతో శనివారం నల్లమలలో వాహనాల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం అటవీ చెక్‌పోస్టు గేటు తీసినప్పటి నుంచి రాత్రి 9 గంటలకు గేటు మూసే వరకు వాహనాలు అధిక సంఖ్యలో శ్రీశైలం తరలివెళ్లాయి. మొత్తం 15వందలకు పైగా వాహనాలు నల్లమలకు రాగా అటవీ చెక్‌పోస్టుల వద్ద టోల్‌గేట్ కేంద్రాలకు రూ.75 వేలకు పైగా ఆదాయం లభించింది. మన్ననూరు, దోమలపెంట ప్రాంతాల్లోని అటవీశాఖ, ఇతర ప్రైవేటు కాటేజీలన్నీ పర్యాటకులతో నిండిపోయాయి. శ్రీశైలం వెళ్లి వచ్చే పర్యాటకులు శ్రీశైలం డ్యామ్ సైట్, ఆక్టోపస్ దృశ్యకేంద్రం, ఫర్హాబాద్ గేట్, ప్రతాపరుద్రుని కోట, ఘాట్ రోడ్డు వద్ద వ్యూపాయింట్‌ల వద్ద పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ స్వీయచిత్రాలను చరవాణీల్లో చిత్రీకరించుకున్నారు. పర్యాటకుల రద్దీ అధికంగా ఉండడంతో శ్రీశైలం రహదారిపై గల రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, టీస్నాక్ పాయింట్లకు వ్యాపారం బాగా సాగిందని నిర్వాహకులు తెలిపారు.
Updated Date - 2023-08-12T23:13:28+05:30 IST