ఇది చారిత్రాత్మక విజయం : మంత్రి నిరంజన్‌రెడ్డి
ABN, First Publish Date - 2023-08-11T23:43:50+05:30
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడం చారిత్రాత్మక విజయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
- నేడు ఏదుల రిజర్వాయర్‌పై రైతులతో విజయోత్సవం
వనపర్తి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడం చారిత్రాత్మక విజయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి రెండో దశ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్‌పై శనివారం నిర్వహించే విజయోత్సవాల ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల వద్ద వేలాదిగా రైతులతో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పాలమూరు కష్టాలను తీర్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడంతో వనపర్తి మునిసిపల్ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2023-08-11T23:43:50+05:30 IST