ఓట్ల కోసం గందరగోళం చేస్తరు
ABN, First Publish Date - 2023-08-02T00:16:20+05:30
ఎన్నికలు సమీపిస్తు న్న సందర్భంగా కొందరు ఓట్లకోసం వచ్చి గందరగోళం చేస్తా రని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
మాట్లాడుతున్న మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
- కొత్త నాయకుల మాటలకు మోసపోవద్దు
- మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, ఆగస్టు 1: ఎన్నికలు సమీపిస్తు న్న సందర్భంగా కొందరు ఓట్లకోసం వచ్చి గందరగోళం చేస్తా రని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆశ కార్యకర్తలతో ఆత్మీయసమ్మేళనం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లు ప్రజల బాగోగులు పట్టించుకోని వారు ఎన్నికలకోసం వచ్చి పోతుంటారని, వారు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలకోసం పనిచేసేవారిని గుర్తిం చుకోవా లన్నారు. ఎంతోమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఆశ కార్యకర్తలకు ఉంటుందన్నారు. ప్రతీ ఆశ కార్యకర్త కుటుం బానికి తనవంతు సహాయం చేస్తానని, గ్రామాలలో ఇల్లులేని వారికి ప్లాటు, లేదంటే ఇల్లు ఇస్తానని, అవకాశం ఉన్నవారికి బీసీ రుణాలు, పిల్లల చదువు, కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నవారికి ఎన్ని లక్షలైనా ఖర్చుచేసి ఆరో గ్యం కాపాడుకుంటామని అన్నారు. అడిగివారందరికీ నల్లాలు ఇస్తున్నామని, రోడ్లు వేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆశ కార్యకర్తలు ఎంతో పనిచేశారని తెలిపారు. ఆశ కార్యకర్తలు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తే గత పాలకులు గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత జీతాలు పెరిగాయని, గౌరవం పెరిగిందని చెప్పారు. 2014కు ముందు మన బతుకులు ఎలా ఉన్నా యి. ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆలోచన చేసుకోవాలని తెలిపారు. ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించేది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు, నాయకులు గణేష్, కృష్ణమోహన్, శివరాజు, చెరుకు పల్లి రాజేశ్వర్, పోతుల గిరిధర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, జావెద్‌బేగ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T00:16:20+05:30 IST