ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సెక్టోరియల్‌ అధికారుల పాత్ర కీలకం

ABN, First Publish Date - 2023-10-26T23:15:50+05:30

ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో సెక్టోరియల్‌ అధికారుల పాత్ర కీలకమైనదని, ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు.

శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- ఎన్నికల సమయంలో బాధ్యతాయుతంగా ఉండాలి

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల న్యూటౌన్‌, అక్టోబరు 26 : ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో సెక్టోరియల్‌ అధికారుల పాత్ర కీలకమైనదని, ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం మాస్టర్‌ ట్రైనర్లతో సెక్టార్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సెక్టోరియల్‌ అధికారులు తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈవీఎం, వీవీప్యాట్లు, హ్యాండ్‌బుక్‌, పోలింగ్‌ కేంద్రాలు, బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లను పోలింగ్‌ కేంద్రాల్లో అమర్చడం, మాక్‌ పోలింగ్‌ నిర్వహణపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. హ్యాండ్‌ బుక్‌లోని ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా చదివి తెలుసుకోవాలని సూచించారు. ఎన్నికల రోజు సిబ్బందికి తగిన సూచనలు చేయాలని చెప్పారు. ఎన్నికల ముందు రోజు సామగ్రి పంపిణీ, సిబ్బంది తరలింపు తదితరాలపై తహసీల్దార్లు, పోలీస్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే శిక్షకులను అడిగి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. ఎన్నికలకు ముందు రోజే పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 5.30 గంటలకు మాక్‌ పోల్‌ నిర్వహించి, సర్టిఫికేషన్‌ పొందాలన్నారు. అనంతరం కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైన మాక్‌ ఓటింగ్‌ను రద్దుచేసి, మళ్లీ జీరో వచ్చిన తర్వాత కంట్రోల్‌ యూనిట్‌ ద్వారా ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని చెప్పారు. శిక్షణ పొందిన రోజు నుంచి పోలింగ్‌ పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రిసైడింగ్‌ అధికారులకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చీర్ల శ్రీనివాస్‌, అపూర్వ చౌహాన్‌, అలంపూర్‌ ఎన్నికల నోడల్‌ అధికారి చంద్రకళ, మాస్టర్‌ ట్రైనర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-26T23:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising