ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమగ్రాభివృద్ధే బీఆర్‌ఎస్‌ లక్ష్యం

ABN, First Publish Date - 2023-10-07T23:02:49+05:30

అన్ని రంగాల సమగ్రాభివృద్ధే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.

గురుకుల పాఠశాల నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

- పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి

మద్దూర్‌, అక్ట్టోబరు 7 : అన్ని రంగాల సమగ్రాభివృద్ధే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మద్దూర్‌లో రూ.ఐదు కోట్లతో నిర్మించనున్న గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి, రెనివట్లలో రూ.1.29 కోట్లతో నిర్మించనున్న పాఠశాల నూతన భవనానికి స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూతూ సీఎం కేసీఆర్‌ గత తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారన్నారు. ఏ రాష్ట్రంలో అమలు చేయలేని సంక్షేమ పథకాలును అమలు చేయడంతో పాటు అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న కృషిని కొనియాడారు. రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎండీ సలీం, మద్దూర్‌, రెనివెట్ల సర్పంచులు అరుణ, భవాణి, ఎంపీటీసీ సభ్యుడు వెంకటయ్య, మండల నాయకులు శివకుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌, వెంక ట్రాములు గౌడ్‌, బాల్‌చంద్రి, సురేందర్‌, నీలి రాములు, వెంకటయ్య, రవినాయక్‌, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-10-07T23:02:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising