ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రుణమాఫీ త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2023-09-26T23:16:49+05:30

రుణమాఫీ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి రైతులకు సహకరించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల న్యూటౌన్‌, సెప్టెంబరు 26 : రుణమాఫీ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి రైతులకు సహకరించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదా యంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో బ్యాంకర్లు, మండల వ్యవసాయ అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పంట రుణాల రెన్యువల్‌కు వ్యవసాయ అధికారులు బ్యాంకర్లకు సహకారం అందించాలని చెప్పారు. పంటల రుణానికి సంబంధించి పెం డింగ్‌లో ఉన్న కేసులను రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. బ్యాంకుల వారీగా హెల్‌డెస్క్‌ కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాంకుకు వచ్చే రైతులకు రుణామాఫీ, కొత్త రుణాలకు ఖాతాలు తెరవడంపై బ్యాంకర్లు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పీఎం ఎఫ్‌ఎంఈ, ముద్ర రుణాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రుణమాఫీపై బ్యాంకర్లు రైతులకు పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రణాళికాబద్ధంగా రుణాలు చెల్లించేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో యూబీఐ ఆర్‌ఎం సత్యనారాయణ, ఏపీజీవీబీఆర్‌ రంజిత్‌కుమార్‌, ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, ఎల్‌డీఎం అయ్యపురెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

కారుణ్య నియామక పత్రాల అందజేత

కారుణ్య నియమకం కింద ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినట్లు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు. నాగేశ్వరి (సమాచారశాఖ), అరవిందరావు(జిల్లా కోశాధికారి)లకు సోమవారం ఆమె ప్రొసిడింగ్స్‌ ఇచ్చారు. అనంతరం వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగానుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం, రాయడం, చదవడం తదితరాలపై ఆరా తీశారు. అంకితభావంతో పనిచేసి ఉన్నతంగా రాణించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాస్‌, ఏవో వీరభద్రప్ప ఉన్నారు.

Updated Date - 2023-09-26T23:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising